14, మార్చి 2013, గురువారం

దనుజుల ద్రుంచినావు

చం. దనుజుల ద్రుంచినావు కడు ధర్మముగా ప్రజ నేలినావు భూ
జనులకు ధర్మమార్గమన చక్కని నీ చరితంబు పాఠమై
మనగ రహించినావు చెడు మార్గము బట్టిన నేటి నేతలన్
మనుపవె నేటికైన ఋజుమార్గమునం కరుణాబ్ధి రాఘవా


(వ్రాసిన తేదీ: 2013-1-22)


2 వ్యాఖ్యలు:

 1. ఈ విషయంలో రాముడు మనమీద శీత కన్నేసినట్లుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండీ. రాములవారి దయతో ప్రజల కష్టాలు తీరవలసినదే‌ కాని ప్రస్తుతకాలపునేతల సుపరిపాలనల వలన కాదు గదా.

   చల్లని చూపుల దేవుడు
   మెల్లగ మన వెతలు దీర్చి మిక్కిలి దయతో
   ప్రల్లదులం బోకార్చగ
   వెల్లివిరియు రామరాజ్యవిభవము ధరపై

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.