21, మార్చి 2013, గురువారం

సీతను గొంచు బోయినను

ఉ. సీతను గొంచు బోయినను చేరి పదంబులు పట్టి మ్రొక్కుచో
నాతనికే నయోధ్య కడు నాదర మెప్పగ నిత్తునన్న వి
ఖ్యాతదయాసముద్ర నిను గాక మరొక్కని చూడబోమయా
భూతలవాసులందు సరి పోలెడు వానిని రామ భూవరా


(వ్రాసిన తేదీ: 2013-1-23)

3 కామెంట్‌లు:

 1. అందుకే కదండీ ఆయన దేవుడయ్యాడు.

  రిప్లయితొలగించు
 2. మంచి భావంతో పద్యం చెప్పారు.
  మూడవ పాదంలో యతి తప్పింది. అలాగే ‘ధరమీద’, ‘భూతలవాసులందు’ అన్నప్పుడు పునరుక్తి వస్తున్నది. సవరించండి.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శంకరయ్యగారూ, మీరు చెప్పిన లోపాలను సరిజేసానండీ. ధన్యవాదాలు.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.