కొంద రున్నారు నా యందు నెయ్యము బూని
అందరకు నీవు నాయకుడవు రామయ్య
విహిత మవిహితమును వినిపింతురు వారు
ఇహపర హితముల హెచ్చరింతువు నీవు
మహదద్భుతమైన మన్ననతో మీరు
వహియింతురిదె నాదు భారము కృపతో
సదుపాయముల నిచ్చి చక్కగా వారు
సదుపాయముల గూర్చి చక్కగా నీవు
వదలక నభివృధ్ధిపధమున నన్ను
ముదమున నుంతురు మ్రొక్కెద మీకు
సకలకార్యములను సవరింతురు వారు
సకలము శుభముగ సమకూర్తువు నీవు
అకళంకకృప నిట్టు లాదరింపగ మీరు
సకలాత్మనా యోగ సాధన నుంటిని
8, ఆగస్టు 2012, బుధవారం
కొంద రున్నారు నా యందు నెయ్యము బూని
3 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చలా బాగా చెప్పేరు. జన్మాష్టమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
తొలగించండిఅందరకూ శ్రీకృష్ణజన్మాష్టమీ శుభాకాంక్షలు.
చక్కని పద్యాలు...
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయి శ్యామలరావు గారూ!
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు....
@శ్రీ