అవునండి.
ఇది 101వ టపా.
ఇందులో విశేషం యేమీ లేదు.
500 టపాలు, ఆ పైన వ్రాసిన వారూ వ్రాస్తున్న వారూ ఉన్నారు.
నేను బ్లాగు ప్రపంచంలో అడుగు పెట్టి, ఈబ్లాగు ప్రారంభించి ఒక సంవత్సరం అయింది.
ఒక సంవత్సరంలో 100 టపాలు పెద్ద విశేషం యేమీ కాదు.
రెండేళ్ళ లోపలే 500 టపాలను మించి వ్రాసిన వారూ ఉన్నారు కదా.
ఈ బ్లాగు వీక్షకుల సంఖ్య ఇప్పటికి 5500 పై చిలుకు.
ఇది కూడా చెప్పుకోదగ్గ సంఖ్య యేమీ కాదు .
లక్షల్లో పాఠకులున్న బోలెడు బ్లాగులున్నాయి.
ఈబ్లాగు సభ్యులు 11 మంది.
నిశ్చయంగా యిది చాలా చిన్న సంఖ్య.
వందల్లో సభ్యులున్న బ్లాగులున్నాయి.
ఈ బ్లాగుకి యిప్పటిదాకా వచ్చిన వ్యాఖ్యలు 252.
ఇది కూడ చాలా చిన్న సంఖ్య.
చాలా బ్యాఖ్యలు టపాల పట్ల ఆమోదానందాలు ప్రకటించినవే.
ఒక మూడు నాలుగు వ్యాఖ్యలు మాత్రం టపానో, నన్నో యెద్దేవా చేస్తూ వచ్చాయి.
వాటిలో వాడబడిన భాష సభార్హం కాక పోవటం వలన వాటిని తొలగించ వలసి వచ్చింది.
కష్టేఫలే బ్లాగరు శ్రీశర్మ గారికీ నాకూ ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యమీద/ వ్యాఖ్యాత మీద కొన్ని ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి కూడా.
ఇది ఆధ్యాత్మకవిత్వ ప్రధానమయిన బ్లాగు.
నా తృప్తి కోసం నేను వ్రాసుకుంటున్న బ్లాగు.
ఒకరిద్దరు ఈ కవిత్వాన్ని ప్రచురించితే బాగుంటుందని సూచించారు.
కాని అది నా శక్తికి మించిన పని యని నాఅభిప్రాయం.
ఇది ఆధ్యాత్మకవిత్వ ప్రధానమయిన బ్లాగు.
కాబట్టి దీనికి విశేషంగా పాఠకులుంటారని నేను ఆశించటం లేదు.
అలాగే విశేషంగా స్పందనలు వస్తాయని యెదురు చూడటమూ లేదు.
స్పందించవలసిన వాడు స్పందిస్తున్నాడు. అది చాలు కదా నాకు
ఈబ్లాగులో నేను వాడుతున్న భాష సంప్రదాయపు వాసనతో ఉంటుందని విదితమే.
కొందరి కది సువాసన. వారికి నా వందనం
కొందరి కది అంతగా నచ్చటం లేదేమో.
కాలప్రభావం కారణం కావచ్చును.
వారు నన్ను క్షమించ గోరుతాను.
వీలయినప్పుడల్లా కొంత తేలిక భాషలో కూడా టపాలు వస్తాయి తప్పకుండా.
కొన్ని టపాల్లో అలాంటి తేలికగా ఉండే భాష కనిపించవచ్చు యిప్పటికే.
ఈ బ్లాగు ఇంకా యెన్నాళ్ళు కొనసాగుతుంది?
ఈ ప్రశ్నకి సమాధానం నా చేతులో ఉన్న విషయం కాదు.
వ్రాయించే వాడు వ్రాయిస్తున్నన్నాళ్ళు కొనసాగుతుందని మాత్రం స్పష్టం.
టపా చాలా పెద్ద దయినట్లుందండి!
చివరగా ఒక చిన్న మాట.
ఆదరిస్తున్న అందరికీ వందనాలు.
వ్రాయిస్తున్న వాడికి వందనాలు.
భవదీయుడు,
తాడిగడప శ్యామలరావు.
హైదరాబాదు.
సెల్ 98496 26023.
syamala.tadigadapa@gmail.com
మిత్రులు శ్యామలరావుగారు, నల్లనయ్య మీ చేత మరిన్ని టపాలు రాసేలా చేయాలని నా కోరిక. రాశి కంటే వాసి ముఖ్యం. మాది కాలక్షేపం, మీదలాకాదే.
రిప్లయితొలగించండిఅభినందనలండి .
రిప్లయితొలగించండిAll the best for your future writings sir.
రిప్లయితొలగించండివందకు అభినందనలు.
రిప్లయితొలగించండిమీలాంటివారైనా భాషను కాస్త నిలబెడితే ముందు తరాలవారికి మంచిభాష అందుతుంది. అభినందనలండీ..
రిప్లయితొలగించండిమనమనుకున్నది రాసుకుంటూ ప్రశాంతంగా వుండటమేనండి,
రిప్లయితొలగించండిచాలా చక్కగా రాస్తారు మీరు, 100 టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు
ముందుగా అభినందనలు.బ్లాగు లోకంలో రకరకాల అభిప్రాయాలూ వ్యక్తమవుతుంటాయి,అన్నింటిని పాజిటివ్ గా తీసుకోండి.రాసుకుంటూ వెళ్ళండి.
రిప్లయితొలగించండివంద దాటినందుకు అభినందనలు అండీ..
రిప్లయితొలగించండిదిగ్విజయంగా శతకం పూర్తి చేసారు...
రిప్లయితొలగించండిఎపుడో విన్న జ్ఞాపకం..
కవిసామ్రాట్ విశ్వనాథ వారన్నట్లున్నారు...
"కవి స్థాయికి పాఠకుడు ఎదగాలి కానీ...
పాఠకుడి స్థాయికి కవి దిగజారకూడదు "అని...
అందువలన మీ స్థాయిని మేము అందుకోవాలంటే,
భాష మీద అధికారం పొందాలంటే...
తపస్సు చేయాలి...
మీకు అభినందనలు...
మీ బ్లాగ్ ఇక ముందు కూడా మాకు భాషా విజ్ఞానం పంచాలని కోరుతూ...
@శ్రీ
మీరు వందోవంద టపాకూడా వ్రాస్తారు . అభినందనలు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివందకు అభినందనలు :)
రిప్లయితొలగించండినాలుగు శతకాలు అధిగమించి
బ్రియన్ లారా పద్దుకు హద్దులు
చూపాలని ఆశిస్తున్నా...
" సెంచురీలు కొట్టే వయస్సు మాది.. ల ల లా .." ;) :)
అభినందనలు.. మీదైన ముద్ర తో మరిన్ని వందలు,వేలు బ్లాగ్ పోస్ట్ లు వ్రాసి భావసంపదను పంచాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అభినందనలు.
రిప్లయితొలగించండిబ్లాగు కదంబం లో మరువం లాంటి మీ కవితలు
రిప్లయితొలగించండిమరువం మేం మరువము.
పదికాలాలు వ్రాసి, రాశి పెంచండి శ్యామలరావు గారు.
మంచి ఆధ్యాత్మిక భావాలతో పదాలనూ కవితలనూ అందించిన మిమ్ము మనసారా అభినందిస్తున్నాను.రాశి లెక్క లేదు. వాసి ముఖ్యం.మరిన్ని మంచి రచనలతో మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిమీరు వందలెన్నో కొట్టాలని మనస్పూర్తి గా అభిలాషిస్తూ..
రిప్లయితొలగించండి