13, ఆగస్టు 2012, సోమవారం

నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు

నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు
వేదనలు మాయమై విరియు సంతోషాలు

కనులు కలిపి పలుకరించు జనులు కానరాని చోట
మనసు తెలిసి మనసు కలుపు మనిషి తోడు లేని చోట
దినదినమును నీడ దక్క యనుచరులే లేని చోట
కనికరించి నీవు నాకు కలెగెదవా అది చాలును

ఇచట నావి తక్క యితరు లెవరి పాద ముద్రలెఱుగ
ఇచట నేను తక్క యితరు లెవరి కంఠస్వరము నెఱుగ
ఇచట నేను ఒంటరినై యేకతంబ గ్రుమ్మరుదును
ఇచటికి నీ వొక్కనాటి కేగుదెంచుటయె చాలును

ఓ మహాను భావ అలసి యుంటి నన్న మాట తలచి
నా మొరాల కించి యింక నాకు ప్రసన్నుడవు కమ్ము
ఈ మేదిని నెల్ల నొంటి నెంత తిరిగి ని న్నఱయుదు
సామాన్యుడ నీ‌ వాడను రామ మరువ కది చాలును

2 కామెంట్‌లు:

 1. చాలా బాగుంది మీరు దైవాన్ని వేడుకొనే విధానం...
  కనులు కలిపి పలుకరించు జనులు కానరాని చోట
  మనసు తెలిసి మనసు కలుపు మనిషి తోడు లేని చోట
  దినదినమును నీడ దక్క యనుచరులే లేని చోట
  కనికరించి నీవు నాకు కలెగెదవా అది చాలును....
  చాల బాగుంది....అభినందనలు శ్యామల రావు గారూ!
  @శ్రీ

  రిప్లయితొలగించండి
 2. వేడుకోలు చాలా బాగుంది. ఆర్తి తో పిలిస్తే పలకడా,కనబడడా..మరో మనిషి రూపములో...

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.