జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః
భావం:
దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము!
వృష్ణివంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక!
మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము!
భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!
స్వేఛ్ఛానువాదం:
జయము దేవకీనందన జయము జయముజయము యదుకులగృహదీప జయము జయము
జయము ఘనమేఘశ్యామాంగ జయము జయము
జయము భూభారనాశక జయ ముకుంద
వివరాలు: యాదవులలో వృష్ణి, అంధక,భోజవంశాలని మూడు శాఖలు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీవసుదేవులని అందరకూ తెలిసినదే. యాదవులలో దేవకి భోజవంశంవాడైన ఉగ్రసేన మహారాజు కుమార్తె. వసుదేవుడు వృష్ణివంశం వాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.