హొయలు మీర ఎగురవే ఓ ధర్మపతాకమా
జయ జయ జయ భరత జాతి కీర్తిపతాకమా
నీ వెగిరెడు చోట నిఖిల సౌఖ్యము లౌను
నీ వరశుభ దృష్టి నిఖిల భాగ్యము లీను
నీ వలన ఘనతలు నిరుపమానము లగుట
భావించి నీ కీర్తి పాడెదము మేము
వన్నెల కులుకుల వసుధ నీ కెదురేది
వెన్నెల చలువలు విసరునే నీ ఠీవి
కన్నుల వెలుగువై గగన వీధిని నిలచి
అన్ని వేళల శుభము లలరార యెగురవే
పరమేశ్వరుని దివ్య పాలనా విభవమ్ము
భరతమాతకు సకల వరము లీయగను
భరతసంతతి కీర్తి పదిదిక్కులను చాట
చిరకాలము నిలచి గరువాన యెగురవే
చిరకాలము నిలచి గరువాన యెగురవే
మువ్వన్నెల జెండా- వన్నెలలో
రిప్లయితొలగించండిసూర్య చంద్ర, గగన గ్రహములు
మురిపెముగా తానములే ఆడేను
మన త్రివర్ణ పతాక తేజస్సులకు జేజేలు!
;