హృదయపుండరీకవాస యీశ వందనము
మృదులహృదయ సదయ పరమేశ వందనము
లోకము లుత్పాదించు నీ కిదే వందనము
లోకముల పోషించెడు నీ కిదే వందనము
లోకముల నిండియున్న నీ కిదే వందనము
లోకయాత్రావినోదరూపశిల్పి వందనము
నిరుపమకరుణాలవాల నీ కిదే వందనము
నరసురకీటాదిభూత నాధ నీకు వందనము
స్మరాదికవైరినాశ స్వామి నీకు వందనము
పరమయోగిసేవ్యమానపాద నీకు వందనము
అన్నోదకము లిచ్చి నన్నరయు స్వామి వందనము
అన్ని వేళలను బ్రోచు నట్టి స్వామి వందనము
అన్ని దిక్కులను నిండి యున్న స్వామి వందనము
పన్నుగ నన్నేలు రామ స్వామి నీకు వందనము
21, ఆగస్టు 2012, మంగళవారం
1 కామెంట్:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ ఆధ్యాత్మ కవితలు కీర్తనలు ద్వారా భక్తితత్పరతతో ఆధ్యాత్మికత్వంను పెంపొందిస్తున్న మీకు శతధా సహస్రదా వందనములు.
రిప్లయితొలగించండి