నమ్మితిమి మన రామచంద్రుని నారాయణుడని నమ్మితిమి
నమ్మిన వారికి మోక్షము కలదని నమ్మితి మయ్యా నమ్మితిమి
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన తొలగును శోకము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన తొలగును మోహము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన తొలగు నవిద్యయు
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన తొలగును భవము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన గలుగు వివేకము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన గలుగును సుఖము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన గలుగును జ్ఞానము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన గలుగును మోక్షము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి జయము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి శుభము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి యభయము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి మోక్షము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి శుభము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి యభయము
నారాయణుడే శ్రీరాము డని నమ్మిన వారికి మోక్షము