రామ జయం రఘురామ జయం
సామీరిస్తుత రామ జయం
భీమపరాక్రమ రామ జయం
కామవైరినుత రామ జయం
భూమిసుతావర రామ జయం
కామజనక హరి రామ జయం
కోమలాంగ హరి రామ జయం
తామరసేక్షణ రామ జయం
ప్రేమరసార్ణవ రామ జయం
రామ జయం సుశ్యామ జయం
రామ జయం శుభనామ జయం
రామ జయం గుణధామ జయం
రామ జయం మునికామ జయం