ఇది నేను రెండవతరగతిలో ఉన్నప్పుడు మా తెలుగువాకచకంలో చదువుకున్న పాట. ఈ రోజున ఎవరో తమ టపాలో దీనిని ప్రస్తావించారు. ఇదింకా ఎవరికైనా గుర్తుందా అని. నాకు గుర్తుందని చెప్పాను కాని ఆ టపా రిఫరెన్సు ఇద్దాం ఇక్కడ అంటే అది కాస్తా ఇప్ప్పుడు గుర్తుకు రావటం లేదు! సరేనని ఈ పాటను మాత్రం ఇక్కడ ఇస్తున్నాను.
ఆదివారమునాడు అరటి మొలచినది సోమవారమునాడు చిగురు తొడిగినది మంగళవారమునాడు మారాకు వేసినది బుధవారమునాడు పొట్టిగెల వేసినది గురువారమునాడు గుబురుగా పెరిగినది శుక్రవారమునాడు చూడగా పండినది శనివారమునాడు అత్తములు కోసితిమి అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో |