31, డిసెంబర్ 2014, బుధవారం

ఆదివారమునాడు అరటి మొలచినది


ఇది నేను రెండవతరగతిలో ఉన్నప్పుడు మా తెలుగువాకచకంలో చదువుకున్న పాట. ఈ రోజున ఎవరో తమ టపాలో దీనిని ప్రస్తావించారు. ఇదింకా ఎవరికైనా గుర్తుందా అని. నాకు గుర్తుందని చెప్పాను కాని ఆ టపా రిఫరెన్సు ఇద్దాం ఇక్కడ అంటే అది కాస్తా ఇప్ప్పుడు గుర్తుకు రావటం లేదు! సరేనని ఈ పాటను మాత్రం ఇక్కడ ఇస్తున్నాను.







ఆదివారమునాడు అరటి మొలచినది
సోమవారమునాడు చిగురు తొడిగినది
మంగళవారమునాడు మారాకు వేసినది
బుధవారమునాడు పొట్టిగెల వేసినది
గురువారమునాడు గుబురుగా పెరిగినది
శుక్రవారమునాడు చూడగా పండినది
శనివారమునాడు అత్తములు కోసితిమి
అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో




2 కామెంట్‌లు:

  1. ఇంత వేగంగా పండే చెట్లు కానీ ఉంటే ఇప్పుడు వన సంరక్షణ కి అంత అవస్థ పడక్కర్లేదేమో కదండీ? పద్యం బానే ఉంది కానీ పళ్ళు ఫోటోలో బాగాలేవండి. గబుక్కున వారంలో పండే పళ్ళు ఇలాగే ఉంటాయ్ కాబోలు :-)

    రిప్లయితొలగించండి
  2. నేనూ చిన్నప్పుదు చదివాను,అరటి తొంద్రగా కాపు వస్తుందని అలా రాసారేమో కదా?.
    దసరా రోజున "ధర సింహాసనమై" పాడుతూ పంతుళ్లతో వూరంతా తిరిగాను కూడా!

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.