వస్తూనే ఉంటాయి సంవత్సరాలు వస్తూపోతుంటాయి కష్టసుఖాలు ఊరంతా వాడంతా గడబిడ తప్ప ఊడిపడిందేమీ లేదు నిన్నటిరాత్రి ఋతుచక్రంలో మార్పేదీ రాలేదు కొత్త ఋతువు రాక కనబడలేదు జన్మలో శివరాత్రిజాగరణ చేయని ఈ జనం రాత్రంతా నిదురమాని ఎంత ఎదురుచూసారో అర్థరాత్రి నూత్నహూణవత్సరం రాక కోసం ప్రతిసారీ పోయినేడు పీడాకారమే ప్రతిసారీ ఈరోజు కెదురుచూడ్డమే ఈసారైనా కోరిన శుభపరంపరలు కొత్తసంవత్సరం కొసరి వడ్డించేనా ఈసారైనా కాసిని శాంతిసౌఖ్యాల్ని కొత్తసంవత్సరం కొసరి వడ్డించేనా రాజకీయరణాంగణంగా మారిన తెలుగింటిప్రాగణంలో నే కోరిన శాంతివనం మొలకెత్తి పూచేనా సకల రాజకీయశనిగ్రహసాహస్రిపై ఇకనైనా కాలపు కొరడా ఎగిరేనా ఈసారైనా ఈ ఎదురుచూపులు ఫలించేనా కాలం కరుణించేనా మరోసారి ఎదురుచూడ మనేనా కోటి ఆశలతో ఎదురుచూడటం అలవాటైపోయిన నరప్రపంచం ప్రతిసంవత్సరానికి ఆశాజ్యోతుల కాంతిపుంజాల కళకళల మధ్య స్వాగితించటం చక్కని రివాజు శుభకామన మాకు తీరని మోజు కాదని ఈసారైనా కాలం చెప్పాలి అందుకే ఇది శుభవత్సరం కావాలి |
1, జనవరి 2015, గురువారం
అందుకే ఇది శుభవత్సరం కావాలి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.