ఉపోద్ఘాతంగా ఈ మధ్య జరిగిన ఒక బ్లాగు చర్చా సందర్భాన్ని ముందుగా ప్రస్తావిస్తాను.
ఈనెలారంభంలో, రచ్చబండ చర్చావేదికవారు భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క విశ్లేషణ మీరు చేయగలరా? అని ఒక ప్రశ్న వేసారు.
వారు చర్చకు పెట్టిన శ్లోకం
తమేవ శరణంగచ్చ సర్వభావేన భారత।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం॥
|
అన్నది. ఇది భగవద్గీతలోని మోక్షసన్యాసయోగంలోని 62వ శ్లోకం.
ఈ చర్చలో మొదటగా నేను స్పందిస్తూ ఒక వ్యాఖ్యను పెట్టాను. పాఠకుల సౌకర్యార్ధం ఆ నా వ్యాఖ్యను యథాతదంగా ఇక్కడ ప్రచురిస్తున్నాను.
ఈ విధంగా ఒక గీతాశ్లోకాన్ని బహిరంగ చర్చకు పెట్టవలసిన అవసరం యేముంది? భగవద్గీతకు అనేకమంది పెద్దలు వ్రాసిన ప్రామాణిక వ్యాఖ్యానాలున్నాయి కదా, అందుబాటులో. .మీరు స్వయంగా చదువుకొనవచ్చును. హఠాత్తుగా ఒక శ్లోకం వెంటబడినంతమాత్రాన అది పూర్తిగా బోధపడకపోవచ్చును. గీతాధ్యయనం అవసరం కావచ్చును. అటువంటి సంధర్భంలో ఇక్కడ చర్చించటం వలనా ప్రయోజనం ఉండదు. ఇది సరైన విధానం కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం వేరుగా ఉంటే ఉండవచ్చును.
|
ఆ తరువాత చర్చ విస్తారంగా కొనసాగింది.
పై వ్యాఖ్యకు అదనంగా మరేమీ వ్యాఖ్యానించే ఉద్దేశం లేకపోయినా K.S. CHOWDARY గారి అభ్యర్థన మేరకు మరికొంత వ్రాయటం తప్పలేదు. ఆ తరువాత నా అనేక వాదోపవాదాలు కొనసాగాయి. ముఖ్యంగా శ్రీకాంత్ చారి గారు అవకాశాన్ని అందిపుచ్చుకొని నన్ను ఎద్దేవా చేయటానికి కాను నా మాటలను పూర్వపక్షం చేయటానికి మిక్కిలి ప్రసంగించారు. చివరకు "పవిత్రత ముసుగులులో వాస్తవాలు వెలికి రాకుండా గొంతు నొక్కాలనే" ప్రయత్నం నేను చేస్తున్నాననే మహదభిప్రాయాన్నీ సభాముఖంగా వెలిబుచ్చారు. సరే, సభాముఖంగా మరికొన్ని అటువంటి ఆణిముత్యాల్లాంటి మాటలూ దొర్లాయనుకోండి చర్చలో.
ప్రస్తుతవిషయం.
ప్రస్తుతవిషయం.
గీతాధ్యయనం పై అరవిందుడి అభిప్రాయం గురించి ఈ రోజున ఒక బ్లాగులో కొన్ని మాటలు చదివాను. అది Integral Yoga of Sri Aurobindo & The Mother అనేది. అందులో The message of the Gita అనే టపాలో ఈ క్రింది వాక్యం కనిపించింది.
In his commentary on the Gita, Sri Aurobindo emphasized that in order to understand the true message, one must patiently read it as a “developing argument” over eighteen chapters, instead of spotlighting a few chapters or scattered verses of one’s liking.
ఐతే చదువరుల్లో కొందరైనా అరవిందుడు చెప్పిన మాటలు యథాతధంగా తెలుసుకో గోరతారు కాబట్టి వాటిని ఈ క్రింద ఉటంకిస్తున్నాను.
The Gita can only be understood,
like any other great work of the kind, by studying it in its entirety
and as a developing argument. But the modern interpreters, starting
from the great writer Bankim Chandra Chatterji who first gave to the
Gita this new sense of a Gospel of Duty, have laid an almost exclusive stress on the first three or four chapters and in those on the idea ̇
karma, the work that is of equality, on the expression kartavyam karma
to be done, which they render by duty, and on the phrase “Thou hast a
right to action, but none to the fruits of action” which is now
popularly quoted as the great word, mahavakya of the Gita. The rest of
the eighteen chapters with their high philosophy are given a secondary
importance, except indeed the great vision in the eleventh. This is
natural enough for the modern mind which is, or has been till
yesterday, inclined to be impatient of metaphysical subtleties and
far-off spiritual seekings, eager to get to work and, like Arjuna
himself, mainly concerned for a workable law of works, a dharma. But it
is the wrong way to handle this Scripture.
(Sri Aurobindo. Essays on the Gita, pp 35 - 36.)
|
అరవిందుల అభిప్రాయం నేను మొన్నమొన్న రచ్చబండలో వెలిబుచ్చిన అభిప్రాయలకు ఎంత దగ్గరగా ఉన్నదీ చదువరులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.
ఈ మాటలు వ్రాయటం ద్వారా వినయం వదలి అతిశయం అనే దాన్ని ఆశ్రయించి మాట్లాడటం ఏమీ చేయటం లేదు నేను. ఈ మాటలు వ్రాయటంలో నా ఉద్దేశం నేను లోగడ రచ్చబండలో ఏమి చెప్పానో, అది పూర్వం పెద్దలచే చెప్పబడినదే కాని, కొందరు ఆక్షేపిస్తున్నట్లుగా నేను కొత్తగా సత్యాన్వేషణా నిరోధం కోసం చేస్తున్న ప్రయత్నం కాదని మరొకసారి అందరి దృష్టికీ తేవటానికి మాత్రమే.
ఇప్పుడు ఎవరన్నా అరవిందులపైన కూడా అభియోగారోపణలూ గట్రా చేస్తారేమో నాకు తెలియదు. అటువంటి సాహసాన్ని ఎవరైనా చేసినా అరవిందులకు కాని గీతకు కాని వచ్చే నష్టం ఏమీ ఉండదు లెండి. కాని ఇప్పుడు ఈ టపాకు ఎటువంటి వ్యాఖ్యలు వస్తాయో తెలియదు కాని ఉచితమైన వ్యాఖ్యలను మాత్రం అంగీకరించవచ్చును కాని అన్ని వ్యాఖ్యలనూ ప్రచురించటం అవసరమని అనుకోను.
యథేచ్ఛసి తథాకురు అని శ్రీకృష్ణుల వారే చెప్పేరు. ఆ గ్రంథమే మాకు స్ఫూర్తిదాయకమని విశ్వసించే కొందరు అత్యున్నత స్థాయి వ్యక్తులూ ఉన్నారు, అంత సీనేమీ లేదని కొట్టి పారేసే రంధ్రాన్వేషకులూ ఉన్నారు. ఇతర పశుప్రపంచం కంటే మనకి అదనంగా ఉన్న రీజనింగుకి పరమావధి ప్రతిదాన్నీ ప్రశ్నించి అనుమానప్పిశాచాలుగా మిగిలిపోవడమేనేమో.
రిప్లయితొలగించండిప్రశ్నించేవారిలో నేర్చుకోవాలన్న తపనతో వినయంతో అర్థించేవారూ ఉంటారు, రంధ్రాన్వేషణాకుతూహలం కలవారూ ఉంటారు. నిరంతరరంధ్రాన్వేషకులతో వాగ్వాదాలు చేస్తూ కూర్చుంటే వినీతులకు బోధించే సమయంలో కొఱత వస్తుందని గ్రహించే సద్గురువులు రంధ్రాన్వేషకులకు జవాబులు చెప్పటం కోసం సమయం వృధా చేసుకోవటానికి యిష్టపడరు.
తొలగించండిగతంలో వేరే చోట జరిగిన విషయాల గురించి నేను వెళ్ళదలచడం లేదని ముందు మనవి.
రిప్లయితొలగించండినాకు తెలిసి బంకింబాబు లాంటి వారు గీతోపాసకులే, అలాగే హిందూ ధర్మాన్ని నమ్మిన వారే. వారికి అరబిందో గారికి మధ్య అన్వయన బేధాలు ఉన్నాయి తప్ప పూర్తి వైరుధ్యం లేదు. వీరి దృష్టిలో కూడా గీతను పూర్తిగా అధ్యయనం చేయాలి కానీ వివిధ శ్లోకాల ప్రాధాన్యతలు సమానం కావు.
మీరు ముద్రించిన అరుబిందో వ్యాఖ్య నుండి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి:
1. ఆధునిక విశ్లేషకులు (ఉ. బంకింబాబు) వాడిన పద్దతి సరా అరబిందో గారి విమర్శ కరెక్టా అన్న విషయంపై గీతా పండితుల & ధర్మ రక్షకుల మధ్య చర్చలు జరిగాయా?
2. ఒకవేళ ఆ చర్చలు జరిగి ఉంటె ఏకాభిప్రాయం లేదా బహుళ సమ్మతం కుదిరిందా?
3. బంకింబాబు లాంటి వారి దృష్టిలో గీతలో అతి ముఖ్యమయిన పరమార్ధం (essence of Gita) ఏమిటి?
4. చౌదరి గారు ఉటంకించిన శ్లోకం (అలాగే జాకీర్ నాయక్ లాంటి "దావా"దారులు ఎన్నుకొనే శ్లోకాలు) పైన చెప్పిన పరమార్దానికి సంబంధం ఉందా?
గొట్టిముక్కలవారు,
రిప్లయితొలగించండిశ్యామలీయం బ్లాగు చర్చావేదిక కాదు. ఇక్కడ నేను అరవిందులు గీతాధ్యయనం గురించి చెప్పిన మాటలను ప్రస్తావించటానికి ఉన్నది ఒకే కారణం. వాటి వెలుగులో లోగడ నేను వెలుబుచ్చిన అభిప్రాయాన్ని అర్థంచేసుకుందుకు పాఠకులకు సౌలభ్యంగా ఉంటుందన్ననా అభిప్రాయమే ఆ కారణం. అంతే కాని అరవిందుల దార్శనికతను చర్చకు పెట్టటం నా ఉద్దేశం కాదు.
మనం ఆధునిక విమర్శనాధోరణిలో అరవిందుణ్ణి ప్రశ్నిద్దామంటే అందుకు సమాధానాలను మనమే అరవిందుల రచనల్లో వెదుక్కోవాలి. అరవిందుల తరపున జవాబుచెప్పే స్థాయి నాకుందనుకోను.
వివిధ శ్లోకాల ప్రాధాన్యతలు సమానం కావని మీరనుకుంటే మీ యిష్టం. కాని ప్రాథాన్యత్యల ప్రసక్తి అన్నదే అసంగతం అన్నది మాత్రం నా మతం అని స్పష్టం చేయదలచుకున్నాను . భగవద్గీతల్లో కొన్నిశ్లోకాలను తక్కువ చేసి చూపటం అన్నది సంప్రదాయం కాదని నా ఉద్దేశం.
ఈ టపా ఆధారంగా గీత యొక్క మంచి చెడ్దలను గూర్చిన (నా దృష్టిలో అసంగతమైన) చర్చ ఇక్కడ చేసే ఉద్దేశం నాకు లేదు.
"వివిధ శ్లోకాల ప్రాధాన్యతలు సమానం కావని మీరనుకుంటే మీ యిష్టం"
తొలగించండినేను అలా అనలేదండీ. బంకిం లాంటి వారు అన్నారని అరబిందో గారి వ్యాఖ్య నుండి అర్ధం చేసుకున్నాను.
The rest of the eighteen chapters with their high philosophy are given a secondary importance, except indeed the great vision in the eleventh.
"గీత యొక్క మంచి చెడ్దలను గూర్చిన"
నేను అడిగిన 4 ప్రశ్నలు గీత మంచిచెడుల గురించి కావని మనవి. నేను మీ దగ్గర నేర్చుకుందామనే అడిగాను తప్ప మరే ఉద్దేశ్యం లేదు.
జైగారు,
తొలగించండివీరి దృష్టిలో కూడా గీతను పూర్తిగా అధ్యయనం చేయాలి కానీ వివిధ శ్లోకాల ప్రాధాన్యతలు సమానం కావు అన్న మీ వ్యాఖ్యలోని వాక్యాన్ని మీ రొకలా ఉద్దేశించితే నేను పొరపాటున మరొకలా అర్థం చేసుకున్నాను. క్షంతవ్యుడిని.
మీరు నే నుదహరించిన అరవిందుల వ్యాఖ్యను చూస్తే, బంకింబాబు లాంటి వారి దృష్టిలో గీతలో అతి ముఖ్యమయిన పరమార్ధం కర్తవ్యకర్మ అని తెలుస్తుంది.
గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అన్న దానిని మహావాక్యంలాగా స్వీకరించి మొత్తం పదునెనిమిది అధ్యాయాలనూ తద్వాక్య విస్తరణగానే, కర్తవ్యకర్మకు సంబంధించిన తన్మహావాక్యం తాలూకు నిరూపణకు కేవలం ఉపకరణాలుగానే బకిం వంటివారు పరిగణించారని అరవిందులు అభిప్రాయపడ్డారు. (ప్రత్యేకంగా పేర్కొన్న పదునొకండవ అధ్యాయం విశ్వరూపసందర్శనం ఒక మిహాయింపు కావచ్చును.) ఇలా భావించటం ఒక ఆధునిక దృక్పధం అనీ అంత ఉచితమైనది కాదని అరవిందులు అభిప్రాయపడ్డారు.
భారతదేశపు చివరివైదికసంప్రదాయిక ఋషిగా అరవిందులకు మంచి గుర్తింపు ఉంది. గీతాహృదయం గురించి కాని వైదికమైన ధర్మమూ సంప్రదాయమూ అనే వాటిగురించి కాని సమకాలీనుల్లోనూ తదనంతరకాలంలోనూ ఆయన కన్న ఉన్నతమైన అవగాహనకలవారు లేరని భావన ఉన్నది. కాబట్టి అరవిందుల అభిప్రాయాన్ని ఇతరుల అభిప్రాయాలతో చర్చకు నిలపటం అన్నది అంత సబబైన చింతనకాదు. ఆయనకు మించి వ్యాఖ్యానించాలన్నా ఆయనతో కించిద్విబేధించి చెప్పాలన్నా మరొక వైదికఋషి ఆవిర్బహ్వించవలసిందే కాని కేవలం పాండిత్యప్రకర్షలతో ఇతరులు చేయగల పని కాదది.
గీత సర్వతోముఖమైన ప్రకాశం కల జీవనపరమార్థ ప్రబోధిని. మహాగురువులు ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్కోణం నుండి దానిని వివరించారు. మనబోటి సామాన్యాధ్యాయనశీలురకు వారి వివరణల్లో విబేధాలు తప్పక గోచరిస్తాయి. గీత ఒక భౌతికశాస్త్రం కాదు - ఒక ఆధ్యాత్మికశాస్త్రం. ఏకాభిప్రాయం కుదరాలన్న నిర్బంధం నిజానికి రెండు రకాలశాస్త్రాల్లోనూ లేదు. బోధయంత పరస్పరం అని గీతాచార్యుడే స్పష్టంగా భగవత్తత్త్వాన్ని గ్రహించే ఉత్తములు తమలో తాము ఒకరి గ్రహింపును మరొకరు పరస్పరం ప్రబోధించుకుంటారని సెలవిచ్చాడు. అందరూ వారివారి ఆధ్యాత్మిక పరిణతిని అనుసరించి వివిధసంధర్భాలను అనుసరించి భగవద్విభూతుల్ని (వాటిలో ఆయన వాగ్విభూతి ఐన గీత కూడా వస్తుంది) పంచుకుంటారని ఆయన తాత్పర్యం. సానుకూల దృక్పధంతో చర్చలు జ్ఞానాభివృధ్ధికి సోపానాలుగా ఉపకరిస్తాయి - ఆధ్యాత్మికౌన్నత్యాన్ని ఇనుమడింప జేస్తాయి. జ్ఞానప్రకర్షనో అభిప్రాయాంతరాన్నో ఆలంబనం చేసుకొని చేసే చర్చలు ఏ పక్షానికీ ఉపయోగించవు. ఇంతవరకూ బహుళసమ్మతం అంటే హెచ్చుమంది అలనాటీ ఆదిశంకరులనుండి, నిన్నటి చలం వరకూ భగవద్గీతను భగవద్విభూతిగానే గ్రహించి అర్థం చేసుకుందుకు ప్రయత్నించారు. ఎవరూ చెడు కనిపించిందని అన్నట్లు లేదు. గీతాబోధపొందిన మొదటి శిష్యుడు అర్జునుడు. ఆయన ఐతే నష్టోమోహ స్మృతిర్లబ్ధ్వా అని సంతోషంగా అన్నాడు. గీత అద్యయనం చేసినా మనకు ఇంకా మోహవిఛ్ఛేదం కాకపోతే అది అసంపూర్ణమైన అధ్యయనం అని అర్థం కాని గీతలో లోపం అని కాదు.
మీ ప్రశ్నలకు నా స్పల్పప్రజ్ఞతో తోచిన సమాధానాలు వ్రాసాను. ఒక విషయం మీకు గురుతుందని అనుకుంటాను. రచ్చబండలో కూడా చౌదరిగారి కోరికమేరకే నా క్లుప్త వ్యాఖ్యపై ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాసాను. కాని ఆ తరువాత జరిగినది చర్చా -లేక- రచ్చా అన్నది మీకు తెలుసు. అందుచేత ఎంతో తటపటాయించి కాని ఈ సమాధానంవ్రాయటం జరగలేదు. అందుకే చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్యకు నా స్పందన వ్రాస్తున్నాను. అందుకు మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించాలి.
చాలా థాంక్సండీ. నాకు కాస్త క్లారిటీ దొరికింది.
తొలగించండికుదిరితే రెండు ఇస్లామిక్ కాన్సెప్తులు దర్యాప్తు చేయండి. 1. "ప్రతి దేశానికి నేను ప్రవక్తను పంపించాను" అన్న ఖురాన్ సూక్తి (10:47) తతనుబంధ విషయాలు. 2. దావా అనే ఇస్లామిక్ ప్రక్రియకు మూలాదారమయిన "వారిని ప్రభువు వద్దకు సన్మార్గంతో తీసుకు రండి" (16:125) లాంటి సూక్తులు.
మీకు కుదిరినప్పుడు జాకీర్ నాయక్ గారి వ్యాసం చదవండి.
http://www.irf.net/Hinduism_concept_of_god.html
ఈ రెంటినీ కలిపి చూస్తె చౌదరి గారి ప్రశ్నల అంతరార్తం తెలుస్తుంది.
PS: నేను వారిని తప్పు పట్టడం లేదు.
ఇస్లామిక్ కాన్సెప్టుల గురించి దర్యాప్తు చేసేందుకు నాకు ఆసక్తి లేదండి. అది వీలుపడదు కూడా ఇస్లామిక్ ధార్మిక విషయాలపై అవగాహన లేని నేను వాటిపై మాట్లాడలేను.
తొలగించండిOK sir.
తొలగించండిశ్యామలీయం గారు,
రిప్లయితొలగించండినా పేరు ప్రస్తావించారు కాబట్టి వ్యాఖ్య రాయవలసి వస్తున్నది, లేనట్టయితే చర్చలో పాల్గొనేందుకు నాకు ఎలాంటి ఆసక్తు లేదని గమనించగలరు.
అక్కడ నా వాదనను మాత్రమే వినిపించాను, ఎద్దేవా అని మీరు భ్రమ పడుతున్నారు. నిజానికి ఎద్దేవా అంటే ఎలా వుంటుందో మీ పోస్టులోనే తెలుస్తుంది.
>>> పూర్వపక్షం చేయటానికి "మిక్కిలి" ప్రసంగించారు.
>>> "మహదభిప్రాయా"న్నీ సభాముఖంగా వెలిబుచ్చారు.
>>> మరికొన్ని అటువంటి "ఆణిముత్యాల్లాంటి" మాటలూ దొర్లాయనుకోండి
ఇదీ ఎద్దేవా అంటే. విషయం మీద వ్యతిరేకిస్తూనో, అనుకూలిస్తూనో వాదించడాన్ని ఎద్దేవా అనరని మీరు గమనించ ప్రార్థన.
ఇకపోతే భగవద్గీతను మొత్తంగా మాత్రమే చూడాలని, అందులోని శ్లోకాలను ప్రత్యేకంగా ఉటంకించనే కుడదని మీరు అరబిందో వారి వద్ద నేర్చుకుని వుండవచ్చును. కాని అంతమాత్రాన అదే సార్వజనీనమై పోదు. అందరూ దాన్నే పాటించాలని ఆదేశించడం నిరంకుశత్వమే కాక అభివృద్ధి నిరోధకం కూడా. అందుకే గీతలో బోధించిన కర్తవ్యపాలనలో భాగంగా, మీ వద్దనుండి నాపై ఇలాంటి చెణుకులు వస్తాయని వెఱచి కూడా ఆరోజు వ్యతిరేకించవలసి వచ్చింది.
శ్రీకాంత్ చారిగారు,
తొలగించండిమీరు యథాశక్తి నన్ను ఎద్దేవాచేస్తూ ఆ చర్చలో వ్యాఖ్యానించిన మాట వాస్తవం కాబట్టే ప్రస్తావించక తప్పలేదు. మీరు చేసినది ఎద్దేవాకాదూ నా మాటలకే ఆ పదం వర్తిస్తుందీ అని మీరంటున్నారు. మంచిది. అ చర్చనూ, ఈటపానూ స్వయంగా చదివి పాఠకులు ఈ విషయంలో ఒక అభిప్రాయం ఏర్పరచుకోవచ్చును. ఇక్కడ ఆ చర్చ యొక్క లింకునూ ఉదహరించాను కదా.
అరవిందులకూ మీ సెగ తగిలించా రన్నమాట. మంచిది, మీకు ఇప్పటికే టపా చివరన ఆ విషయంపై సమాధానం ఉన్నది.
శ్యామలీయం బ్లాగు చర్చావేదిక కాదు. చర్చలో పాల్గొనేందుకు మీకు ఎలాంటి ఆసక్తి ఉన్నా లేకపోయిన ఇక్కడ చర్చ యేమీ జరగటం నాకు సమ్మతం కాదు. అందుచేత దయచేసి చర్చగా కొనసాగింపులేమీ వ్రాయవద్దు.
పాఠకులకు విజ్ఞప్తి: శ్రీకాంత్ చారిగారు తమ అభిప్రాయాన్ని చెప్పారు. నా సమాధానమూ ఇచ్చాను. ఈ విషయంలో చర్చకు తావులేదని గమనించగలరు.
@sreekaant chaari
తొలగించండిగీత అనేది 18 అధ్యాయాలతో 700 పై చిలుకు శ్లోకాలు వున్న అనేక విషయాల కలగలుపు.అయినా 18 అధ్యాయాలు కూడా ఒక ముఖ్యమయిన విషయానికి స్మబంధించి సపోర్టు కోసం చెప్పే విభిన్న విషయాల్ని ఒక్కచోట చెర్చిన భావ సంకలనం.నాలుగో అధ్యాయంలో ఒకచోట పది శ్లోకాల పాటు చెప్పిన భావాన్ని హఠాత్తుగా ఆపేసి మరో భావాన్ని యెత్తుకుని మళ్ళీ హఠాత్తుగా పదిహేడో అధ్యాయంలో మరోచోట ఆ పది శ్లోకాలకి కొనసాగింపుని యెత్తుకునే సందర్భాలు కూడా వున్నాయి.వీటన్నింటిని కలిపి చదివితే గానీ అర్ధం కాని గీతలో ఒక శ్లోకాన్ని ప్రత్యేకంగా విశ్లేషించదం వల్ల యేమి ప్రయోజనం?మత్తై 16:17 అనీ పేతురు 12:24 అనీ బైబిలు లో కూడా వున్నాయి.అంతా ఒక్కచోటే వుండాలి,ఆ ఒకే ఒక ముక్కలోనే నాకంతా తెలియాలి అనడం అత్యాశ!
హరిబాబుగారి పై వ్యాఖ్య కొత్తది కాదు 7న చేసినదే. పునరుక్తి! ఎందుకో తెలియదు.
తొలగించండినిజమే,పునరుక్తి లాగా పునర్మీటుడు అయ్యింది.తరవాత తెలిసింది.రెండోది తొలగించినా అనాకు అభ్యంతరం లేదు!
తొలగించండి
రిప్లయితొలగించండిఇక్కడేదో 'అగ్ని మీళే' జరుగు తోంది !
ఘ్రుతం ఎక్కడ ! ఎక్కడ ! వెంటనే రావలె !!
జిలేబి
అటువంటిదేమీ లేదండీ. నిశ్చింతగా ఉండండి.
తొలగించండిరెండు అసందర్భపు సందేహాలు:
రిప్లయితొలగించండి1.మీరు పరిష్కరించి శుధ్ధంగా రాసిన లలితా సహస్ర నామావళి లింకు ఇవ్వగలరా!
2.గుర్రం లో రావాల్సిన బండిర అక్షరాన్ని లేఖినిలో యెలా రప్పించాలి?
హరిబాబుగారూ,
తొలగించండి౧. లలితాసహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక చూడండి.
౨. లేఖినిలో మీరు ka~r~ra అని వ్రాస్తే అది కఱ్ఱ అని వస్తుంది. బండిరకు ~r వాడాలి.
కృతజ్ఞతలు!
తొలగించండిగీత అనేది 18 అధ్యాయాలతో 700 పై చిలుకు శ్లోకాలు వున్న అనేక విషయాల కలగలుపు.అయినా 18 అధ్యాయాలు కూడా ఒక ముఖ్యమయిన విషయానికి స్మబంధించి సపోర్టు కోసం చెప్పే విభిన్న విషయాల్ని ఒక్కచోట చెర్చిన భావ సంకలనం.నాలుగో అధ్యాయంలో ఒకచోట పది శ్లోకాల పాటు చెప్పిన భావాన్ని హఠాత్తుగా ఆపేసి మరో భావాన్ని యెత్తుకుని మళ్ళీ హఠాత్తుగా పదిహేడో అధ్యాయంలో మరోచోట ఆ పది శ్లోకాలకి కొనసాగింపుని యెత్తుకునే సందర్భాలు కూడా వున్నాయి.వీటన్నింటిని కలిపి చదివితే గానీ అర్ధం కాని గీతలో ఒక శ్లోకాన్ని ప్రత్యేకంగా విశ్లేషించదం వల్ల యేమి ప్రయోజనం?మత్తై 16:17 అనీ పేతురు 12:24 అనీ బైబిలు లో కూడా వున్నాయి.అంతా ఒక్కచోటే వుండాలి,ఆ ఒకే ఒక ముక్కలోనే నాకంతా తెలియాలి అనడం అత్యాశ!
రిప్లయితొలగించండిహరిబాబుగారూ, మన్నించాలి నిన్న బ్లాగును చూడకపోవటం వలన మీ వ్యాఖ్య ప్రచురించటంలో ఆలస్యం జరిగింది. ఈ విషయంలో నా అభిప్రాయాలు బ్లాగులోకానికి ఇప్పటికే విదితంగా ఉన్నాయి. కాబట్టి నేను క్రొత్తగా చెప్పవలసిందేమీ లేదు. నా అభిప్రాయాల వెనుకే వాటిపైన కించిత్తు తీవ్రంగా ఖండనలూ వస్తున్నాయన్నదీ అందరూ గమనిస్తున్నదే. ఒక విషయం తెలుసుకుందుకు మనం కృషి చేసి ఎదగాలన్నది నిన్నటి ఆలోచనావిధానం. ఏ విషయమైనా మనకు తెలిసేందుకే దిగిరావాలన్నది నేటి అలోచనావిధానం. రేపటి వారి దృక్పథంలో అసలు తెలుసుకోవలసిన విషయాలంటూ ఏమన్నా ఉండటం అన్నదే తప్పు అని కావచ్చును. కాలపుగారడీని చూస్తూ వినోదించటం తప్ప ప్రాజ్ఞులు చేయగలిగింది ఏమీ కనిపించదు. ఇలా అన్నందుకూ కొందరు దారుణాఖండలశస్త్రతుల్యములైన మాటలు విసురుతారనీ తెలుసు. చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి విచారమూ లేదు.
తొలగించండిఅధ్బుతమైన సమాచారం
రిప్లయితొలగించండి