తే. రంగురంగుల బొంతల గంగిరెద్దు ముంగిళుల ముందు విన్యాసములను చేయు పండువిది వచ్చె తోచిన పగిది రూక లిచ్చి పంపుడీ మనసార మెచ్చి మీరు తే. చెప్పులైనను నోచరు జీర్ణవస్త్ర ధారులీ మేళగాండ్రు మీ దయకు పాత్రు లాదరించుడు మనసార నయ్యలార అమ్మలార సురవిటపి కొమ్మలార ఉ. వండిన పిండివంటలను వారికి పెట్టుడు మానుడమ్మ ఆ యెండిన డొక్కలం గనియొ కించుక బువ్వననుగ్రహించరే పండువగాదె వారికిని భవ్యమనస్కులు పాతదైననుం కండువ నయ్యగారి దయగా నిడరే పరమాత్మ మెచ్చగన్ కం. ఈ యేడు వచ్చినారని పై యేటికి వత్తురనుచు భావింపగ రాద న్యాయంబుగ నేటేటికి మాయంబగుచుండి రనెడు మాట దలచుడీ కం. వీరికి తిండిలేదు మరి వీరల బిడ్డలు పాపలందరున్ నోరు వచింపలేని గతి నుందురు ముద్దకు నోచకుందురున్ వారిని చేరదీయగను వారికి బళ్ళను విద్యనేర్పగన్ కోరవుగా ప్రభుత్వములు కొంచెపువారల పెత్తనంబులన్ కం. అయగారని యమ్మాయని నయమున ప్రార్థించి మ్రొక్కినారని యైనన్ దయచూపుడు మీరైనను జయమిచ్చును మీరు చూపు జాలియె మీకున్ |
15, జనవరి 2015, గురువారం
సంక్రాతి గంగిరెద్దుల వాళ్ళని దయతో ఆదరించండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వీరు వ్యవసాయం బహు చక్కగా చేస్తారు. గంగిరెడ్లని ఆడించడమే వృత్తికాదు వీరికి. ముట్టి పొగరు గిత్తలను లొంగదీసి వ్యవాసాయనికి అనుగుణంగా తీర్చి దిద్ది రైతుకు అప్పజెబుతారు. ఇది వీరికి వెన్నతో పెట్టిన విద్య.
రిప్లయితొలగించండికావచ్చునండీ.
తొలగించండికాని గంగిరెద్దులను ఆడించేవారిలో అనేకులు యాచకవృత్తిలో ఉన్నారనీ ఈ మధ్యన వ్యాసాలు వచ్చాయి - వాటిలో కొందరు చెప్పిన మాటలు దానిని ధృవపరుస్తున్నాయి.
ఈరోజు టీ-న్యూస్ కథనం (ప్రోగ్రాం పేరు గంగెడ్ల బతుకు ఘోష అనుకుంటా) కూడా అలాగే చెబుతుంది.
తొలగించండి