20, డిసెంబర్ 2014, శనివారం

ఎఱిగిన దొక్క నీవే కదయ్య





ఈశ్వరా యీ సృష్టి యెందుకు చేసెదో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా జీవుల మెందు కిందుంటిమో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా మాయలో నెందుకు ముంచెదో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా యేజీవి కెప్పుడు మోక్షమో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

యేమి చేయుదు నీ ప్రశ్న లెవరి నడిగి
యేమి లాభంబు లేదని యెఱిగి తుదకు
చేయునది లేక కరుణతో చెప్పుమనుచు
నిన్ను ప్రార్థించుచుంటి ప్రసన్నమూర్తి




5 కామెంట్‌లు:

  1. రచ్చబండలో హెచ్చరించినందుకు థాంక్స్. దైవము నుండి వచ్చింది కాబట్టి దేవుడు,నాకేమిటో అప్పుడప్పుడూ దేముడు అని వ్రాస్తూ ఉంటాను. ఇంక గుర్తుగా సరిచేసు కుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్కరాజువారు,

      నన్ను కూడా పెద్దలూ శ్రేయోభిలాషులూ చీవాట్లు వేస్తున్నారండీ, యిలాంటి నిరుపయోగకరమైన చర్చల్లో తలదూర్చి నా సమయాన్నీ శక్తియుక్తుల్నీ దురుపయోగపరుస్తున్నానని. కాని ఒక దుర్వాక్యం అనిపించిన సందర్భం చూసీచూడనట్లుగా ఊరుకోలేని బలహీనత. అందుచేత వద్దనుకుంటూనే అమాయకంగా పదేపదే ఇలాంటి చర్చల్లో తలదూర్చి ఎత్తిపొడుపులకూ పెళుసుమాటలకూ గురియౌతూ ఉంటాను. ఈ చర్చలను నిర్వహించేవారికి వాదం ఎంత జనాకర్షణియంగా జరిగితే అంత ప్రయోజనం కాబట్టి వారు రంకెలువేసే వారిని నిరోధిస్తారని భావించటం అత్యాశ, తరచుగా జరిగేది ఏమిటంటే వాదాగ్ని పెరగటానికి తెలిసీతెలియక మనం కూడా కొన్ని పుల్లలు వేయటమూ, తద్వారా మరిన్ని అనుచితమైన మాటలకు అచ్చుయోగం కల్పించటమూ. అంతే. స్వానుభవం దృష్ట్యా మీరు ఇరుక్కుంటున్నారని గ్రహించి చూస్తూ ఊరకోలేకనే తలదూర్చాను. స్నేహితులొకాయన చెప్పినట్లు ఈ‌రకమైన వాదనలను మనకంటే పండితులూ అనుభవజ్ఞులు ఊరకనే ఉపేక్షించటం‌లేదు కదా. మనం దేనికి ఇలాంటి బురదల్లో కాలుపెట్టాలి? మీకు నా సలహా నచ్చినందుకు సంతోషం.

      తొలగించండి

    2. ఇది ఏదో యెహోవా కీర్త న లా ఉన్నది !

      ఆమెన్
      జిలేబి

      తొలగించండి
  2. < " నన్ను కూడా పెద్దలూ శ్రేయోభిలాషులూ చీవాట్లు వేస్తున్నారండీ, యిలాంటి నిరుపయోగకరమైన చర్చల్లో తలదూర్చి నా సమయాన్నీ శక్తియుక్తుల్నీ దురుపయోగపరుస్తున్నానని. " >

    అయినా మీరు పెద్ద మారినట్లు లేదుగా శ్యామలరావు గారు :))
    మీరేమనుకోకపోతే "సిగరెట్లు మానెయ్యటం తేలిక, నేను చాలా సార్లు మానేసాను" అనేది గుర్తొస్తోంది నా మట్టుకు :)) (జిలేబీ గారి ఊతపదం లాగా "జేకే" ).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిప్రాయం నిజమే కావచ్చునండీ నరసింహారావుగారూ. అంత తొందరగా అలవాట్లను వదిలించుకోలేము. నా అనుభవం ఇతరులకు పాఠం ఐతే సంతోషమే. మెల్లగా మారేందుకే ప్రయత్నిస్తున్నానండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.