శ్రీరాముని మీరు నమ్మితే ఆ
శ్రీరాముని మీరు కొలిచితే
శ్రీరాము డిచ్చును స్థిరజీవితమును
శ్రీరాము డిచ్చును చిత్తశాంతియును
శ్రీరాము డిచ్చును సిరిసంపదలను
శ్రీరాము డిచ్చును పరివారములను
శ్రీరాము డిచ్చును భోగము యోగము
శ్రీరాము డిచ్చును పూర్ణారోగ్యము
శ్రీరాము డిచ్చును సుఖసంతోషాలు
శ్రీరాము డిచ్చును పూర్ణాయువును
శ్రీరాము డిచ్చు ను లోకపూజ్యతను
శ్రీరాము డిచ్చును చక్కన్ని యశము
శ్రీరాము డిచ్చును ధైర్యంబు మీకు
శ్రీరాము డిచ్చును శౌర్యంబు మీకు
శ్రీరాము డిచ్చెడు నభయంబు మీకు
శ్రీరాము డిచ్చును విజయంబు మీకు
శ్రీరాము డిచ్చును వరములు మీకు
శ్రీరాము డందించు కరమును మీకు
శ్రీరాము డిచ్చును సద్భుధ్ధి మీకు
శ్రీరాము డిచ్చును సద్విద్య మీకు
శ్రీరాము డిచ్చును జ్ఞానంబు మీకు
శ్రీరాము డిచ్చును సద్భక్తి మీకు
శ్రీరాము డిచ్చు వైభోగంబు మీకు
శ్రీరాము డిచ్చును సర్వంబు మీకు
శ్రీరాము డిచ్చు వైరాగ్యంబు మీకు
శ్రీరాము డిచ్చును మోక్షంబు మీకు