ప్రగుణము. వినవయ్యా నా మనవిన్ రామా నను నీసేవం గొన నీవయ్యా |
ఈ చిట్టి వృత్తానికి గణవిభజన స-గగ. గణవిభజన IIU UU. ఇంత చిన్న వృత్తానికియతిమైత్రి స్థానం అంటూ అవసరం లేదు కాని ప్రాసనియమం మాత్ర్రం అవసరమే.
విశ్వనాథవారు ఈ ప్రగుణవృత్తాన్ని వాడారు. ఇతరకవు లెవరైనా వాడినదీ లేనిదీ తెలియదు.
కేవలం ఎనిమిది మాత్రలకే పరిమితమైన ఈ వృత్తానికి ప్రత్యేకమైన నడక యేదీ ఉన్నట్లు లేదు.రెండు చతుర్మాత్రాగణాలుగా పాదం ఉన్నది కాబట్టి చతురస్రగతి ఐతే సులభంగానే దీనికి పడుతున్నది.