ఉత్సుకము. రాముని నామమె చాలదా రాముని గాథలె చాలవా రాముని పాటలె చాలవా రాముని తత్త్వము నేర్పగన్ |
ఉత్సుకము.
ఈ ఉత్సుకము అనే వృత్తానికి గణవిభజన భ-భ-ర. అంటే పాదానికి తొమ్మిది అక్షరాలు. కాబట్టి యతిస్థానం అక్కరలేదు. వృత్తం కాబట్టి ప్రాస పాటించవలసి ఉంటుంది. ఈ వృత్తానికే మదనోద్ధురా అని మరొక పేరు.
భ-భ-ర అంటే మనకు ఉత్పలమాల గుర్తుకు రావాలి. దాని గణ విభజనలో భ-భ-ర అని వస్తుంది కదా, అందుకని.
పూర్వకవి ప్రయోగాలున్నాయా ఉత్సుక వృత్తానికి అన్నది తెలియదు.