పరమభాగవతులు రామభజనకు రండు పరమపురుషుడైన చక్రి భజనకు రండు |
|||
నోరారగ మనసు కరువుతీర పాడ రండు శ్రీరాముని పొగడిపొగడి సేదతీర రండు మీ రెరిగిన కృతులు విభుడు మెచ్చ పాడ రండు చేరి మనము రామభజన చేయ వచ్చు రండు |
పరమ |
||
పోచికోలు కబురులతో ప్రొద్దుపుచ్చనేల రాచకార్యమేముండును రాత్రిపూట మీకు వాచవియట రామభజన వాసవాదులకైన లేచి రండు భజనచేయ లేచి రండు వేగ |
పరమ |
||
రామభజనతో గోపరాజు ముక్తి నొందె రామభజనతో త్యాగరాజు ముక్తి నొందె రామభజనతో హనుమ బ్రహ్మపదము నొందె రామభజనతో పొందరాని దేమిగలదు |
పరమ |
||
7, ఏప్రిల్ 2015, మంగళవారం
పరమభాగవతులు రామభజనకు రండు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)