కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా | |||
లోకుల మాటల నెన్ని నీకు మ్రొక్కుట లేదు లోకులం దెందరు నేడు నీకు మ్రొక్కేరో నీ కనులు కరుణ తోడ నిండి యుండుట జూచి నాకు నచ్చెను గాన నీకు మ్రొక్కుచు నుంటి | కొంచెపు | ||
సొమ్ములిచ్చెదవని నమ్మి మ్రొక్కుట లేదు సొమ్ములున్న వారికెల్ల సుఖముండేనా నెమ్మనమున శాంతినింపు నీ చిరునవ్వే నాకు సొమ్మైయుండుట జూచి సొరిది మ్రొక్కుచు నుంటి | కొంచెపు | ||
అట్టే విద్యలు లేవే యభ్యాసములు లేవే మెట్టవేదాంతము బుధ్ధి మెదలును గాక గట్టిగ నీ చెలిమి నున్న కాచుచుందు వది జూచి పట్టి నీ పాదములు రామా పాహి యనుచుంటి | కొంచెపు | ||
4, ఏప్రిల్ 2015, శనివారం
కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)