ఏమో అది ఏమో నే నే మెఱుగుదు రామా నీ మహిమ నే నే మెఱుగుదు |
|||
భూమిజ తానెఱుగును శ్రీమహాలక్ష్మి తాను సౌమిత్రియు నెఱుగు శేషాహియే తాను తా మెఱుగుదు రయ్య తపసిసత్తము లైన వామదేవ వశిష్ట విశ్వామిత్రులు |
ఏమో |
||
వాయుసుతు డెఱుంగును పరమశివుడు తాను ఆ యెలుగుల రా జెఱుంగు నజుని యంశ తాను మాయామానుష విగ్రహ మరి యితరులకు నీ యధ్భుతతత్త్వము దుర్జ్ఞేయ మయ్య |
ఏమో |
||
పరగ రామదాస త్యాగబ్రహ్మాదులకు కరుణతో మోక్షమొసగి కాచిన దేవ నిరుపమానందరూప నీ వాడనుగా సరగున నొనరించి ప్రోవ జాగేల నయ్య |
ఏమో |
||
24, మార్చి 2015, మంగళవారం
ఏమో అదియేమో నే నేమెఱుగుదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)