శ్రీరామచండ్రులవారికిమనం చేస్తున్న మానసిక పూజ పూర్తిచేసుకున్నాం. పూజాఫలాన్ని కూడా బహగవదర్పణం చేయటం తో మన సంకల్పం సుసంపన్నం అవుతుంది.
అర్పణం
క. మానసికంబుగ చేసిన
ఈ నా చిరుపూజ నీకు హృదయంగమమే
యౌనని తలచెద రామా
దీని మహాఫలము గొనుము దీవన లిమ్మా
తాత్పర్యం. ఓ శ్రీరామచంద్రప్రభూ! ఈ విధంగా నా మనస్సులోనే నీకు నేను చేసుకున్న చిరుపూజ నీ మనస్సుకు ఆనందం కలిగిస్తుందనే తలుస్తున్నాను. ఇలా నిన్ను పూజించుకోవటం మహాపుణ్యఫలాన్ని ఇస్తుందని నాకు తెలుసు. ఆ ఫలాన్ని కూడా నీకే అర్పించుకుంటున్నాను. దయచేసి అదికూడా స్వీకరించి అనుగ్రహించు. నన్ను దీవించవయ్యా. అది చాలు నాకు.
(ఆగష్టు 2013)