9, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 132

శా. నీపై చిత్తము నిల్పగోరుదునయా నీ నామమాహాత్మ్యమే
నా పాపంబుల నన్నిటిం జిదుమ నానందంబుగా సర్వసం
తాపంబుల్ దిగద్రోసి నీ కొలువు నుత్సాహంబునం జేసెదన్
కాపాడం దగు నన్ను శ్రీరఘువరా కారుణ్యవారాన్నిధీ



(వ్రాసిన తేదీ: 2013-5-23)