1, నవంబర్ 2017, బుధవారం
వట్టిమాటల కేమి వంద చెప్పవచ్చును
వట్టిమాటల కేమి వంద చెప్పవచ్చును
గట్టివైరాగ్య మెచట కనుల జూడవచ్చును
ఒకటే యొకటే నని ప్రకటించు వారును
ఒకటి కాదు రెండని యుగ్గడించు వారును
ఒకటి రెండు కాదు మూడున్న వనే వారును
రకరకాల సిధ్ధాంతరాధ్ధాంతము లాయెను
తలనిండ సిధ్ధాంతముల నించి యాపైన
ఒలికింతు రెంతయో పలుకుల వేదాంతము
చిలుకపలుకుల వలన చేకూరు మేలేమి
తెలియక నిజమైన దివ్యతత్త్వ మెడదలో
తలపులు వృథపుచ్చనేల దాశరథిని తలపక
పలుకులు వెచ్చించనేల పాహిరామా యనక
నిలుప నిర్మలభక్తి నిలచును వైరాగ్యము
తొలగు కర్మబంధము కలుగు మోక్షంబును
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.