నిన్న జూలై 10న మాన్యులు శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు నన్ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య రూపంలో ఈ క్రింది పద్యం చెప్పారు.
నీమమ్మున పల్లె జనులు దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ , దేముడిలో తప్పు వెదుకు ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా! ఈ వ్యాఖ్య నేపథ్యం, రాజారావు గారి చేత రస సిద్ధులు అనిపించుకొన్న ధన్యజీవి జిలేబీ గారు తమ వరూధినీ బ్లాగులో వ్రాసిన దేవుడు బాబాయ్ టపా. ఈ టపాలో జిలేబీ గారు 'బెత్తం మేష్టారు' అని తమకు సహజమైన వ్యంగ్యధోరణిలో సంబోధించినది నన్నే అన్నది తెలుగుబ్లాగులోకంలో అందరికీ సులభగ్రాహ్యమైన విషయమే. అదేమి చిత్రమో కాని రాజారావు గారి దృష్టికి రససిధ్ధులుగా కనిపిస్తున్న జిలేబీగారు నా కంటికి మాత్రం ఎందుకనో కాని నిత్యమూ విరససిధ్ధులు గానే కనిపిస్తున్నారు మరి. ఈ రోజున జిలేబీ గారు మా గురువులుంగారు నన్ను బర్తరఫ్ జేసినారు అని ఓ చురక వేసారు నాకు. కాని ఆ బర్తరఫ్ అవయోగం ఎందుకు తమకు సంప్రాప్తించిందీ అంటే తాము అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యను వ్రాయటం కారణంగానే అన్నది మాత్రం జిలేబీ గారు ప్రస్తావించలేదు సుమా. అసభ్యపదాలతో వ్రాయటం కూడా ఒక రససిధ్ధి యోగాభ్యాసవిధానమే అన్న కొత్తసంగతి నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. నిజమైన ధీమంతులకే ఇలాంటి మహావిషయాలు తెలుస్తాయేమో నాకు తెలియదు. కొంతకాలంగా గమనిస్తున్నాను. రాజారావు గారు నా విషయంలో కొంత వైమనస్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. కొన్నికొన్ని సందర్భాల్లో నా మాటలను ఖండిస్తూ తమతమ పద్యవిలాసం చూపారు కూడా. పెద్దలు వారితో విరోధభావం సముచితం కాదని నేను వారి మాటలను మౌనంగా గమనించీ గమనించనట్లే ఉంటున్నాను. కాని ఈ నాడు నాకు కొంచెం హెచ్చు బాధకలిగి సమాధానం వ్రాయవలసి వస్తున్నది. దీని నిడివి కారణంగా ప్రతివ్యాఖ్యగా వ్రాయటం వీలుపడదు కాబట్టి ఒకటపాగా వ్రాస్తున్నాను. దీని అర్థం వారితో విరోధం కోరుతున్నానని కాదు. భాషతీరును తెలిసిన వారు మీకు దేముడను మాట పుట్టువు తెలియవచ్చు దేము నెఱిగిన వారలే ధీమతులన నేమి చెప్పుదు దేవునే యెఱుగు దేను ఏను పెరిగిన యూళ్ళలో నెన్నడైన దేవు డను వారినే గాని దేము డనెడు మానవుని చూచి యెఱుగను మాన్యచరిత దేముడని మ్రొక్కు వార లేతీరువారొ తెలియమిం జేసి కొందరు దేము డనుచు వ్రాయు టెఱుగుదు గాని యెవ్వార లేని దేముడని పల్కి మ్రొక్కుట తెలియ దయ్య నీమ మను మాట నటు లుండనిండు స్వామి ఎందు లేనట్టి పదముల కొంద రెఱుక చాలమింజేసి వాడెడు చాడ్పు నఱసి తెలిసినంతగ తప్పును దిద్ది నంత భాష తీఱెఱుగడు నాగ బల్కదగునె వ్యావహారిక మను పేర వట్టి గ్రామ్య పదములను కూడ వ్రాయుట భావ్య మనుచు భావవాదుల మని బల్కువారు మీరు భాష యెటులున్న నేమన వచ్చు నింక సంప్రదాయమ్ము కలిగిన చక్కనైన విద్య సద్విద్య సద్వేద్య పద్యవిద్య దాని గౌరవమును దీయ దగదు మనకు పద్యముల నైన సుష్టుగా వ్రాయవలయు వచనమున గూడ సుష్టువై వరలు భాష వాడి నంతట మీదు నవ్యతకు విన్న దనము కల్గదు భావముల్ తళుకు చెడవు వన్నె గ్రామ్యంబె యందురా వందనములు కల్గుచో వైమనస్యంబు కల్గు గాక యకట కొద్దిగ శ్యామలీయంబు పైన నంత మాత్రంబునకు నేల వింత వింత వాదములు నెత్తి పొడుపుల పద్యములును పండితుడగాను యెఱిగిన వాడ గాను ధీమతుడగాను కొంచెమే తెలిసియుందు వినయశీలుడ మీబోటి వారి తోడ వాదులాడంగ తగినట్టి వాడ గాను ధీమతుడ నని చేసిన దెప్పిపొడుపు నా మనంబును కలచిన నాకు బాధ కలిగి పలికితి నంతియ కాని యొకరి కేమి చెప్పగ తగువాడ నెంతవాడ |
11, జులై 2016, సోమవారం
దేముడు ఎవరో తెలియని ధీమంతుడిని అట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఏ కారణం వల్లనో?
రిప్లయితొలగించండిచాలా చిన్న విషయమండీ. ఈ మధ్య కొందరు దేవుడు అన్నమాటకు పొరబడి దేముడు అన్న మాట వాడటం నా కంటబడింది. వారికి సరిచేసుకోవలసిందిగా సూచించాను. బ్లాగ్లోకవిశృంఖలవిహారిణి జిలేబీగారికి కోతికి కొబ్బరికాయ దొరకిన చందమైనది. ఆవిడొక టపారాసి అగ్గిరాజేసారు. కొదరికి నామీద దురదృష్టవశాత్తు అమిత్రభావం ఉన్నట్లుంది. సందర్భాన్ని వినియోగించుకొని రాజారావుగారు నామీద విసుర్లతో ఒక కందం వ్రాసారు. నాకు మనస్తాపం కలిగి ఒక్కముక్కలో జవాబు కుదరక, ఈ టపా వ్రాసాను. అంతేనండి.
తొలగించండిఈటపా అనంతరమూ రాజారావుగారు శాంతించనూ లేదునేరుగా నాకు సమాధానం ఇవ్వనూలేదు. జిలేబీగారి టపాక్రింద మరిన్ని వ్యాఖ్యల్లో విసుర్లపర్వంకొనసాగించారు. తన బ్లాగులో కూడా అది ఒక టపా రూపంలో కొనసాగించారు.
వారి ధోరణినీ, నా టపాలో నేను వారికి ఇచ్చిన మర్యాదనూ విఙ్ఞులు స్వయంగా పరిశీలించగలరని ప్రార్థన. ఈ విషయంలో మరింతగా వ్రాయదలచుకో లేదండి.
బహుశః పండితుల మధ్య ప్రచ్ఛన్నంగా ఉండే వైరం అయ్యుండచ్చని నాకనిపిస్తోంది. ఏమైనప్పటికీ మీరు స్పందించకుండా ఉంటే ఉత్తమమని నా అభిప్రాయం. ఇటువంటి విషయాల్లో మిన్నకుండిపోవడం మనశ్శాంతికి ఓ దారి కదా.
రిప్లయితొలగించండినేను పండితుడను కానండి. ఐనా ఈవిషయంలో ఇకపై స్పందించను.
తొలగించండితెలుగు తూలిక మాలతి గారి బ్లాగ్ పోస్ట్ "వ్యాఖ్యానాలు - నా అనుభవాలు" చదవండి వీలయితే. ఈ రోజే వచ్చింది.
రిప్లయితొలగించండిచక్కగా వివరించారు సర్..
రిప్లయితొలగించండి