20, జులై 2016, బుధవారం

శ్రీరాము డున్నాడు చింత యేల

     


రామకృపాస్తోత్రంసీ. పరమకృపాళువై పాపంబులను బాప
        శ్రీరాము డున్నాడు చింత యేల

దయను సముద్రుడై తాపంబులను దీర్చ
        శ్రీరాము డున్నాడు చింత యేల

కరుణాంతరంగుడై కష్టంబులను దీర్చ
        శ్రీరాము డున్నాడు చింత యేల

కనికరించి తలను కాచి రక్షించగా
        శ్రీరాము డున్నాడు చింత యేల


తే. కలిమి శ్రీరామకృప చేత కలుగుచుండు
లేమి శ్రీరామకృప చేత లేకయుండు
జయము శ్రీరామకృప చేత జరుగు చుండు
బ్రతుకు శ్రీరామకృప చేత పండుచుండు


ఆ.వె. శరణు శరణు రామ పరమకృపాధామ
శరణు శరణు రామ సార్వభౌమ
శరణు శరణు రామ పరమపావననామ
శరణు శరణు ధరణిజా సమేత


కం. ఈ‌ రామకృపాస్తోత్రము
తీరుగ జపియించ రామదేవుని కృపచే
ధారాళమగును సౌఖ్యము
శ్రీరాముని యందు భక్తి చేకూరు హృదిన్7 కామెంట్‌లు:

 1. 'బ్రతుకు శ్రీరామ కృప చేత పండు చుండు'నూటికి నూరు పాళ్ళు నిజం చెప్పారు, ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 2. శ్రీరామ స్తోత్రం బాగుంది, 'దయా సముద్రుఁడై' ....దగ్గర గణాలను సవరించండి.

  రిప్లయితొలగించండి
 3. Sir the poems are like nectar in simple language. The above poems I liked immensely.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ స్తోత్రం పద్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇది వ్రాయటంలో ముఖ్యంగా మూడు ఉద్దేశాలు. 1. సులభమైన భాష, శైలి, భావం. 2. ఎక్కువ పొడుగ్గా ఉండకపోవటం ద్వారా ఒక నిముషంలో చదువుకొనేలా ఉండటం. 3. భక్తి కలవారికి మరింత అనురక్తి కలిగేలా ఉండటం.

   తొలగించండి
 4. సరళమైన పదజాలంతో ఆబాలగోపాలముకు అర్థమయ్యేటట్లు వ్రాశారు.

  "పాహి రామప్రభో" పద్యాలు లోని భావం మధురం, తత్త్వప్రధానం, సారమయం, భక్తిమయం. ధన్యులం సర్.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.