24, జనవరి 2013, గురువారం

రాముని బోలు రాజొకడు


ఉ. రాముని బోలు రాజొకడు రాజ్యము చేసిన దేడ నుర్విపై
రాముని బోలు పుత్రుడు ధరాతల మందున నేడ బుట్టె మా
రాముని బోలు భర్తయన రాముని బోలెడు సోదరుండనన్
భూమిని పుట్టలేదు మరి పుట్టరు పుట్టరు పుట్టరెన్నడున్



(పద్యం రచించిన తేదీ: 2012-12-29)

3 కామెంట్‌లు:

  1. మరి పుట్టరు పుట్టరు పుట్టరెన్నడున్

    అంత నిరాశ పడద్దు, స్వామి సంభవామి యుగే యుగే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇందులో నిరాశ యేమీ లేదండీ, త్రికాలములయందునూ తనకు సాటివచ్చే వాడు లేడని రాముని ఘనత చాటడమే పద్యం యొక్క ఉద్దేశం.

      తొలగించండి

  2. శ్రీ రాములవారు గోదారీ తీరం లో భద్రం గా అచలం గా నెలవై పోయారు మరి!


    జిలేబి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.