23, జనవరి 2013, బుధవారం

రాముడు కాచు నా తలను


ఉ. రాముడు  కాచు నా తలను 
    రాముడు కాచు ధనంబు మానమున్
రాముడు కాచు  జీవనము

    రాముడు కాచు బలంబు తేజమున్
రాముడు  కాచు  నా మనము  

    రాపిడి బొందిన వేళలందు  నా
రాముడు నాకు రక్షకుడు  

    రాముడు సర్వము నాకు నిత్యమున్


(పద్యం వ్రాసిన తేదీ: 2012-12-29)

8 కామెంట్‌లు:

  1. సత్యం చెప్పేరు.ఒక చిన్న సూచన. రోజుకు ఒకటి రెండు పద్యాలు ఒకే సమయానికి ప్రచురించరణ వచ్చేలా చూస్తే మేము వెతుక్కోనక్కరలేదు. మీవీలుబట్టి సుమా. రాసినవి ఉంచుకోండి. సలహా ఉచితమని కలగచేసుకున్నందుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పటికి దాదాపు ౬౦ పద్యాలు వ్రాయటం జరిగింది. అన్నీ కొద్ది టపాలలో ప్రకటించటం కన్నా రోజుకు ఒకటి రెండు ప్రకటిస్తే మిత్రులకు మననం చేసుకోవటానికి వీలుగా‌ఉంటుందని భావించాను. ప్రస్తుతానికి నేను అనుకున్నది ఉదయం ఒక పద్యమూ సాయంత్రం ఒకటీ ప్రచురించాలని. అలాగయితే అవసరమైన చోట్ల వివరణలు ఇవ్వటం సులభంగా ఉండి ఉభతారకంగా ఉంటుందని అనుకున్నాను. వీలయినంతవకూ పద్యాలు చాలా సుబోధకమైన భాషలో వ్రాస్తున్నాను. కాబట్టి వివరణలు అవసరం కాకపోవచ్చును. మీ సలహా కూడా బాగున్నది. కాబట్టి రేపటినుండీ ఉదయమే రెండు పద్యాలు వేర్వేరు టపాలుగా ప్రకటిస్తే సదుపాయంగా ఉంటుందేమో.

      తొలగించండి
  2. రోజుకి ఒక పద్యం లేదా రెండు ఒక టపాలో.మళ్ళీ మరుసటిరోజే, చదువుకునేవాళ్ళకి బాగుంటుంది, మీరూ రోజూ టపా వేసినట్లుంటుంది, మీరు కొత్త పద్యం రాసుకోడానికీ, బ్లాగులు చదువుకోడానికీ, కామెంట్లు ఉరకడానికీ, సమయముంటుందని నా విన్నపం.

    రిప్లయితొలగించండి
  3. అప్రస్తుత ప్రసంగం కాదుకదా!

    రిప్లయితొలగించండి
  4. కష్టే ఫలే వారు,

    'అప్రస్తుత ప్రసంగం కాదు కదా ' ! ఇట్లాంటి వస్తాయనే, శ్యామలీయం వారు, మొట్ట మొదటి వాక్యం "రాముడు కాచు నా తలను" అనేసారు మరి !

    జిలేబి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.