22, జనవరి 2013, మంగళవారం

శ్రీరామచంద్రమూర్తికి


కం. శ్రీరామచంద్రమూర్తికి
కారుణ్యాలయున కేను కడు భక్తుడ నే
శ్రీరామా యని పిలచిన
నా రాముడు పలుకు చుండు నా కేవేళన్ఈ నాటినుండి పాహిరామప్రభో అనే శీర్షికతో ధారావహికగా కొన్ని పద్యాలు ప్రకటిస్తున్నాను.
ఇది శతకం కాదని దయచేసి గమనించగలరు.
ఈ‌ కృతి ముఖ్యోద్దేశం రామభక్తులకు సులభపఠనీయంగా ఉండే  హృద్యపద్యవిరచనమే.
ఈ‌పద్యాలు రామభక్తి పరాయణులకు ఆనందం కలిగించగలవని నా విశ్వాసం.
ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయగలరు.

(ఈ‌ పద్యం రచించిన తేదీ: 2012-12-29)