మ. సత్యప్రతిజ్ఞ యిట్టులని చక్కగ చాటెను రామచంద్రుడే
నిత్యము ధర్మవర్తనము నేర్పుగ చాటెను రామచంద్రుడే
స్తుత్యుడు నిత్యుడీశ్వరుడు చూడగ మా రఘురామచంద్రుడే
భృత్యుడ నందుచేత కడు ప్రేమమయుండగు రామమూర్తికిన్
(రచించిన తేదీ: 2012-12-31)
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
మరీ అంత స్వంతం చేసుకుంటే ఎలాగండీ, మాకూ కొంచం వదలిపెట్టండి. :)
రిప్లయితొలగించండిఅయ్యా, భగవత్సేవాభాగ్యానికి మనసుండాలే కాని యెంతమందికైనా కొలువులో చోటు ఉంటుందండీ.
రిప్లయితొలగించండి