16, జనవరి 2013, బుధవారం

ఒద్దిక నుంటిని నేను

ఒద్దిక నుంటిని నేను విడచి పో
వద్దని వేడు చుంటిని నేను

న్నుల ముందున్నటులుండి
కన్ను మరుగాయే విద్యను
వన్నెకాడా చూపవలదని
విన్నవించిన వినకపోతివి

నటన నేర్చిన నాయకుడవే
యెటుల నిన్నాకట్టు కొందును
దిటవుగా నిను నమ్మియుంటిని
కటకట కడు కఠినుడ రామ
 
ముద్దుముద్దుగ నేనె నీవని
యద్ది యూహ నా మనసున
కొద్దిగ నే మైమరచి యుండగ
సద్దు చేయక జారిపోదువు

2 కామెంట్‌లు:

  1. మై మరచి ఉన్నను చేయి జారినను
    హృదయ మందిరం లో నే ఉన్నానయ్యా!

    'मै'మరిచి, మనంబున నన్ను నెంచ వయ్యా
    ఆ పై, జారుడూ లేదు, పట్టు, విడుపులూ లేవు!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. నటన నేర్చిన నాయకుడవే
    యెటుల నిన్నాకట్టు కొందును
    దిటవుగా నిను నమ్మియుంటిని
    కటకటా కఠినుడవు నీవు

    అలా కనపడతాడు, కాని మనసు వెన్న.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.