29, జనవరి 2013, మంగళవారం

రాముని బోలు పుత్రుడును


ఉ. రాముని బోలు పుత్రుడును రాముని బోలెడు నట్టి మిత్రుడున్
రాముని బోలు భర్తయును రాముని బోలెడు నట్టి యన్నయున్
రాముని బోలు సత్ప్రభువు రాముని బోలెడు ధర్మమూర్తియున్
రాముని బోలు దైవమన రాముడె గాక మరొక్క డుండునే.



(వ్రాసిన తేదీ: 2013-1-10)


4 కామెంట్‌లు:

  1. అబ్బా, శ్యామ 'రామేయ' వారు,

    ఇంత మస్కా నా!!|!


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. అమ్మా జిలేబీగారూ,
    ఇది గాఢమైన భక్తి కవిత్వం.
    ఇటువంటి కవ్తిత్ఫం ఇలాగే ఉంటుంది సర్వసాధారణంగా.
    అయినా నేను అసత్యోక్తులు యేమీ వ్రాయటం లేదని మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.
    మీకేమైనా యిబ్బంది కలిగిస్తుంటే క్షంతవ్యుడను.
    నా చేతులో యేమీ లేదు.
    ప్రేరణ యేలా ఉంటే అలాగు పద్యాలు వస్తున్నాయి.
    ముఖ్యంగా పెద్దవయసులో నాకు నిత్యపారాయణోపయుక్తంగా ఉండేందుకు గాను రాముడే వ్రాయిస్తున్నాడని నమ్ముతున్నాను.
    నా ఒక్కడికే నా పద్యాలు స్వంతం అనుకునేంతటి స్వార్థం మంచిదీ కాదు, అది నాకు లేనూ‌ లేదు.
    కాబట్టి ఆసక్తి గల యితరులకూ సదుపయోగకారిగా ఉంటుందని భావించి యీ కృతిని ప్రకటించటం మొదలు పెట్టటం జరిగింది.
    యెవరూ అన్యథా భావించ వద్దని మనవి.
    యెవరికైనా యెక్కడైనా అర్థతాత్పర్యాదుల విషయంలో సందేహాలు యేమైనా ఉంటే తప్పక తీరుస్తాను.

    రిప్లయితొలగించండి
  3. శ్యామ రామేయం గారు,

    నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ, అన్నట్టు, మా అమ్మ గురించి రాయక పోతేను ! అర్థం చేసుకోరూ!!


    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీగారూ,

      లలితాసహస్త్రంలో అమ్మవారికి గలనామాల్లో ఒకటి 'సమానాధికవర్జితా' అని. అంటే ఆవిడతో సమానులు గాని ఆవిడకన్న అధికులు గాని లేరని తాత్పర్యం. దీన్ని పట్టుకుని శివుడూ‌ ఆవిడ కంటే తక్కువవాడేనట అని తర్కం చెయ్యకూడదు కదండీ. శివశక్తులకు అబేధం అని తెలిస్తే చిక్కు విడిపోతుంది.

      అమ్మవారికి అత్యంత యిష్టం అయినది అయ్యవారిని కీర్తిని గురించి వినటం అట.

      అలాగే సీతారాములూను. సీతారాములకూ‌ అబేధం పాటించాలి. పుంస్త్వమూర్తిగా‌ శ్ర్రీరామచంద్రులవాదైన పరబ్రహ్మతత్వమే స్త్రీమూర్తిగా సీతమ్మవారు. అందుచేతా రామయ్యను కీర్తించటం అమ్మవారికి అమితానందమే. మీరేమీ దిగులు పడకండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.