30, జనవరి 2013, బుధవారం

రవిచంద్రులు తారకలును


కం. రవిచంద్రులు తారకలును
భువియును స్వస్థితుల కోలుపోయెడు దాకన్
రవికులపతి శుభచరితం
బవలంబన మగుచు సజ్జనాళిని బ్రోచున్


(వ్రాసిన తేదీ: 2013-1-10)

5 కామెంట్‌లు:

 1. కోలుపోయిననైనా
  అంటే ఇంకా రసవత్తరంగా ఉంటుందేమో...
  నాకు తోచిన ఆలోచన....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమధ్రామాయణంలోని యీ పద్యం చూడండి:

   యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
   యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్ |
   యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
   తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో ||

   (రిఫరెస్ను: http://kandishankaraiah.blogspot.in/2011/12/144.html)

   తొలగించండి
 2. మొదటి లైన్ ని గుర్తు పెట్టుకోవడానికే ఆరునెలలనుండి తంటాలు పడుతున్నాను నేను.
  హనుమద్రామాయణం ఎక్కడ దొరుకుతుందో ప్రయత్నించాలి.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.