నీనామమే రమ్యము రామా నీపాదమే గమ్యము
నీనామమే దివ్యము రామా నీవే మాసర్వస్వము
నీనామమే మాకు నిఖిలార్ధసాధకము
నీనామమే మాకు కామజయ కారకము
నీనామమే భూమిపై నున్న యమృతము
నీనామమే మాకు నిజమైన యానందము
నీపాదమే కదా నిఖిలపాపాంతకము
నీపాదమే కదా నిఖిలశాపాంతకము
నీపాదమే కదా నిరవధిసుఖప్రదము
నీపాదమే కదా నిశ్చయముగ గమ్యము