రామచంద్ర హరి నమోస్తుతే
కామితవరద నమోస్తుతే
సీతారామా నమోస్తుతే
వారిధిబంధన నమోస్తుతే
పౌలస్త్యాంతక నమోస్తుతే
భూరికృపాళో నమోస్తుతే
పురుషోత్తమ హరి నమోస్తుతే
నారాయణ హరి నమోస్తుతే
జ్ఞానమయాకృతి నమోస్తుతే
ఇనకులతిలకా నమోస్తుతే
వనజదళేక్షణ నమోస్తుతే
దనుజవిరామా నమోస్తుతే
మునిమఖరక్షక నమోస్తుతే
మునిజనకామిత నమోస్తుతే
మోహనరూపా నమోస్తుతే
జననాథోత్తమ నమోస్తుతే
జగదభిరామా నమోస్తుతే
భాసురవిక్రమ నమోస్తుతే
భండనపండిత నమోస్తుతే
కోసలనాయక నమోస్తుతే
కోదండధర నమోస్తుతే
దాసజనావన నమోస్తుతే
దశరథనందన నమోస్తుతే
వాసవాదినుత నమోస్తుతే
వైకుంఠాధిప నమోస్తుతే