శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
28, జనవరి 2026, బుధవారం
హరినామమే
హరినామమే కద యతిమధురము శ్రీ
హరినామమే మన కానందము
హరినామమున కన్య మది యెట్టి దైన
సరిసరి మన కది సరిపడదే
హరినామమును గ్రోల ననవరతంబును
త్వరపడుచుందుము తహతహతో
పరవశమున నిదే పాడుచు నుందుము
హరేరామ యని శ్రీ హరేకృష్ణ యని
మరి యన్యముల గోల మనకెందుల కని
హరినామసుధారస మానుచును
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)