శ్రీరామ రామ సీతారామ
నారాయణా భవతారకనామ
నారాయణా భవతారకనామ
ధారాధరశ్యామ దశరథరామ
వారాశిబంధన పట్టాభిరామ
నీరాక కోసం నేవేచియుంటి
కారుణ్య ధామా కనరావేమీ
ధరణిని తనువుల దాల్చుచు నేను
తిరుగుచు నుంటిని దిక్కుతోచకను
కరిగేను కాలము కడచె యుగములు
హరి నీవు రావేమి ఆదుకోవేమి
ఎన్నాళ్ళు వేచితి నికనైన నీవు
నన్నేలు కోవయ్య నా తండ్రి రామ
చిన్ని బిడ్డను నేను శ్రీరామ నీకు
నన్ను రక్షింపగ రావేమి తండ్రి