శ్రీ రఘురామ యనవే మనసా
సీతాపతి రామ యనవే
కారుణ్యధామ యనవే మనసా
కమనీయనామ యనవే
కామారి సన్నుతుని కమలాయతాక్షుని
భూమి జనులు మెచ్చగా పొగడవే
ప్రేమస్వరూపుని వీరాధివీరునీ
క్షేమదాయకుని భజన చేయవే
పవలైన రేయైన పాతకనాశననుని
భువనమోహనుని నీవు పొగడవే
పవమానసుతార్చిత పావననాముని
భవవినాశకుని గూర్చి పాడవే
తారకరామ యని దశరథరామ యని
వారిజనేత్రు గూర్చి నీవు పాడవే
ఊరక పుట్టిచచ్చు టుడిగించు రాముని
చేరి యిదే నీవు భజన చేయవే