శ్రీహరి కీయని జీవిత మెందుకు
శ్రీహరి నిండని జీవిత మెందుకు
శ్రీహరి నిండని జీవిత మెందుకు
శ్రీహరినామము జిహ్వాగ్రంబున
చిందులు త్రొక్కని జీవిత మెందుకు
శ్రీహరితత్త్వము నెఃతయు శ్రధ్ధగ
చింతన చేయని జీవిత మెందుకు
శ్రీహరిపాదాంబుజముల కెప్పుడు
సేవలు చేయని జీవిత మెందుకు
శ్రీహరి భక్తుల సంగతి నెన్నడు
చేయక తిరిగెడు జీవిత మెందుకు
శ్రీహరి రూపము మనసున నిత్యము
ప్రీతిగ నిలుపని జీవిత మెందుకు
శ్రీహరి కథలను వినుటకు తహతహ
చెందని మానవజీవిత మెందుకు
శ్రీహరియే దైవంబని యెరుగక
క్షితికి భారమగు జీవిత మెందుకు
శ్రీహరి పాదములకు శరణాగతి
చేయగనోచని జీవిత మెందుకు
శ్రీరామా యని తారక నామము
చెలగిజపించని జీవిత మెందుకు
మథురమథుర మగు కృష్ణలీలలను
మనసా తలుపని జీవిత మెందుకు