నీకు సాటి లేరయ్య లేనే లేరు
లేనే లేరయ్య రామ లేనే లేరు
మానవేశ నీకు సాటి లేనే లేరు
జ్ఞానసింధు నీకు సాటి లేనే లేరు
దానవారి నీకు సాటి లేనే లేరు
మౌనివినుత నీకు సాటి లేనే లేరు
దీనావన నీకు సాటి లేనే లేరు
శ్రీనివాస నీకు సాటి లేనే లేరు
ధ్యానగమ్య నీకు సాటి లేనే లేరు
జానకీశ నీకు సాటి లేనే లేరు