నేలతల్లి బిడ్డకు నీలాలక సీతకు
పూలజడ వేయరే వాలుకంటికివిల్లు విరిచినందుకే పెండ్లి యాడినదట
నల్లనయ్యను కోడలుపిల్ల మొన్నను
విల్లంటే విల్లటనే విషగళుని విల్లట
పిల్లంటే పిల్లటనే పృధ్వి కన్నబిడ్డట
పాలనుండి యొక పడతి ప్రభవించి వరించి
ఆ లలితాంగి చేరె నానల్లనయ్యను
నేల నుండి ప్రభవించి నిన్ననే వరించి
ఈ లలితాంగి చేరె నీనల్లనయ్యను
విచ్చేయు వేళాయెను వేడుకతో విభుడు
ముచ్చటగా పూలజడ ముడువుడమ్మ
లచ్చిమగని సాటి శ్రీరామచంద్రుడైన
లచ్చికి ప్రతిరూపమీ రమణి సీతయు