నరుడు పొందు చున్నా డరయ నిదే నిజము
ధనములకై తిరుగువారు తలచెదరా హరిని
వనితవెంట తిరుగువారు వలచెదరా హరిని
తినితిరుగుచు నుండు వారు తెలిసెదరా హరిని
వినుడు వీరు హరినెఱుగక వెఱ్ఱులగుదురు
కొంద రన్యదేవతలను కొలిచిచెడుదు రిలను
కొంద రేమొ తర్కించుచు నుందు రనవరతము
కొంద రేమొ నాస్తికులై యుందు రమాయకులు
కొందరకే హరినామము నందు బుధ్ధి నిలుచు
భవతారకుడగుచు రామబ్రహ్మ ముండు టెఱిగి
యవనినిశ్రీరామనామ మాశ్రయించి నిలచి
పవలురేలు హరియందే భావ ముంచు వాడు
చివరకు హరిపదము చేరునట్టి వాడు నిజము