12, ఆగస్టు 2015, బుధవారం

తన రాకపోకలు తా నెఱుగడు








తన రాకపోకలు తా నెఱుగడు
తన కర్మఫలములు తా నెఱుగడు



తనను నడపు శక్తి తా నొక టున్నదని
తన బుధ్ధి నెన్నడు తలపోయడు
తనచుట్టు బలవత్తరమైన ప్రకృతి
తనకు పరిమితి యని తా నెఱుగడు
తన రాక

హృదయస్థుడై యున్న యీశ్వరు నెఱుగడు
సదయుడు వాడని మది నెఱుగడు
వదలక వేదాంతవిదుల సేవింపడు
తుదకు తనగతి యేమొ యది యెఱుగడు
తన రాక

అటులయ్యు హరికృప  యెటునుండి వచ్చునో
మటుమాయ మగు లెల్ల మాయావరోధము
చటుకున శ్రీరామచంద్రుని పైభక్తి
పొటమరించును బుధ్ధిపుట్టి తరించును
తన రాక