7, జూన్ 2022, మంగళవారం

పురుషోత్తమ నిను పొందితిమయ్యా

పురుషోత్తమ నిను పొందితిమయ్యా
పురుషోత్తమ మాపుణ్యమెట్టిదో

పురుషోత్తమ హరి భువనాధార
పురుషోత్తమ సురపూజితచరణ
పురుషోత్తమ హరి మోహవిదార
పురుషోత్తమ మునిమోక్షవితరణ

పురుషోత్తమ రఘుపుంగవ రామ
పురుషోత్తమ యదుపుంగవ కృష్ణ
పురుషోత్తమ అఘమోచకనామ
పురుషోత్తమ జగన్మోహనరూప

పురుషోత్తమ పరమోదార హరి
పురుషోత్తమ మునిమోహనరూప
పురుషోత్తమ శుభకరుణాపాంగ
పరిపాలితనిజభక్తసమూహ

3 కామెంట్‌లు:

 1. కీర్తనలు చాలా చాలా బాగున్నాయి అన్ని చదువుతున్నాను... లక్ష్మి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీకు ఈరామకీర్తనా సాహిత్యం నచ్చినందుకు చాలా సంతోషం. తప్పక చదవండి. మీ పూర్తిపేరు చెప్పి ఉంటే మరింత సంతోషంగా ఉండేది. (మనలో ఇంటింటా ఒకటి రెండు లక్ష్ములు సాధారణం కదా. నాకు తెలిసిన లక్ష్ములలో మీరెవరో తెలియలేదు. లేదో మరొక లక్ష్మి గారేమో!)

   తొలగించు
 2. ఈ కీర్తన చాలా బాగా వచ్చిందండి!

  రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.