జయజయోస్తు రామ జయోస్తుభవవిరామ
జయజయోస్తు రామ జానకీరామ
హరి పంక్తిరథతనూజ ధరణీసుతామనోజ
సురనాథవినుతతేజ వరభక్తకల్పభూజ
కమలాప్తకులపవిత్ర కమనీయనిజచరిత్ర
అమరారిగణామిత్ర సుమనోజ్ఞనీలగాత్ర
పరమాత్మ మనుజవేష నరనాథకులవిభూష
సురవైరిగణవిశోష సురలోకపరమతోష
సుగుణాలవాల రామ సూర్యాన్వయాబ్ధిసోమ
జగదేకసార్వభౌమ నగజేశవినుతనామ
పూర్తి గా సంస్కత కీర్తన ఎంతో బాగున్నది
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ.
తొలగించండి