20, అక్టోబర్ 2015, మంగళవారం

రాముని సత్యముం గన పరాకుబడం దగదయ్య     ఉ. రాముని సోయగంబు నొక
          రాక్షసి కన్గొని సంభ్రమించెనే
     రాముని ధర్మరూపుడని
          రాక్షసుడొక్కడు చాటిచెప్పెనే
     రాముని ధర్మనిష్ఠ నొక
          రాక్షసు డారసి పోయి మ్రొక్కెనే
     రాముని సత్యముం గన
          పరాకుబడం దగదయ్య మానవా

      


4 కామెంట్‌లు:


 1. One extreme can alone find the excellence of the other extreme :)

  విజయ దశమి శుభాకాంక్షల తో

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. very true.

   మీకూ సకుంటుంబంగా విజయదశమీపర్వదినశుభాకాంక్షాకోటి.

   తొలగించండి
 2. మాస్టారూ,విజయదసమి శుభాకాంక్షలు!భాగవతం యెన్ని స్కంధాలు?ఒక లింకు దొరికింది,"తల్లీ నిన్ను దలంచి" తో మొదలై ప్రతి అక్షరమూ స్పష్తంగా ఉన్న ప్రతి - కానీ మూడు స్కంధాలే లింకులుగా ఉన్నాయి.

  మీరు ఇప్పటికే చూసి ఉంటారేమో,చూడకపోతే లింకు ఇస్తున్నా,చూదండి!చూసి మొత్తం భాగవతం పూర్తి అయిందో లేదో చెప్పగలరు.
  link:http://www.telugubhakti.com/telugupages/Bhagavatam/Bhagavtam.htm

  డ్రాప్ డౌన్ మెను క్లిక్ చేస్తే భాగాలు కనబదతాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతం ౧౨ స్కందాలు. మీరిచ్చిన లింకు చూసి చెబుతాను.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.