15, అక్టోబర్ 2015, గురువారం

రాముడు సర్వజగద్విభుడు


      ఉ. రాముడు నేడు మా ప్రభువు
         రాముడు నిన్నను మా ప్రభుండె ఆ
      రాముడు రేపు మా ప్రభువు
         రాముడు సర్వజగద్విభుండు మా
      రాముడు మూడుకాలముల
         రక్షణ గూర్చుచు నుండ ప్రీతిమై
      రాముని దివ్యతత్త్వమునె
         వ్రాయుచు పాడుచు నుందు మెప్పుడున్
5 కామెంట్‌లు:

 1. బాగుంది గానీ ఇదేమి వృత్తమో చెప్పారు కాదు. సీస పద్యంలాగా రాసారు కానీ కిందన తేటగీతో, ఆటవెలదో లేదే? అలా చూడగానే తెలుసుకునేటంత పరిజ్ఞానం నాకు లేదు మరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీసం కాదండీ ఉత్పలమాల. భ-ర-న భ-భ-ర-వ దీని గణప్రవృత్తి. 10వ అక్షరం యతిస్థానం. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంది. వృత్తాలను పాదమంతా ఒకే లైనుగా వ్రాయటమూ ఉన్నది, యతిస్థానం దగ్గర లైను ముగించి మిగిలిన పాదభాగం వేరొక లైనుగా క్రిందను వ్రాయటమూ ఉన్నది సంప్రదాయంలో. ఐతే పాదద్వితీయార్థాన్ని సౌలభ్యం కోసం కొంచెం జరిపి వ్రాస్తారు - పైన నేను వ్రాసినట్లు. సామాన్యవృత్తమే కదా అని నేను పద్యం ముందు వృత్తసంకేతం వ్రాయలేదు. సరే, ఇప్పుడు జతపరుస్తాను.

   తొలగించండి
 2. ఈరేడు లోకాల నేకపత్నీవ్రతం
  బొక్క రామునికిగా కొండులేదు
  ఒక్కటే మాటగా నొక్కటే శరముగా
  నొక్కరాముండుగా కొండులేరు
  ధర్మంబు తప్పని ధరణీశు డిలలోన
  నొక్కరాముండుగా కొండులేరు
  రక్షించు విభులలో రాణకెక్కిన వాడు
  ఒక్కరాముండుగా కొండులేరు

  నామ జప మాత్ర తరియించు నామమొలయ
  నొక్కరాముండు తప్ప వేరొండు లేరు
  పల్లె పల్లెన గుడులలో భజనలంద
  నొక్కరాముండు తప్ప వేరొండు లేరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది రాజారావుగారూ.
   వీలు వెంబడి, చిన్నచిన్న అన్వయదోషాలు పరిష్కరించి ఈ బ్లాగులో ప్రచురించవచ్చునా?

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.