16, అక్టోబర్ 2015, శుక్రవారం

అవశ్యం మోక్షపదం     చ. ఎవనికి రామగాథ యన
          నెక్కుడు ప్రీతి రహించు చుండునో
     ఎవనికి రామనామ మన
          నెక్కుడు ప్రేమ జనించు చుండునో
     ఎవనికి రామపాదముల
          నెక్కుడు భక్తివివిశేష ముండునో
     భవము తరించి యా నరు
          డవశ్యము మోక్షపదంబు నందెడిన్

    


2 కామెంట్‌లు:

 1. రాముడేలిన రామరాజ్యమందంతట
  నెల మూడు వానలు నిలిచి కురిసె
  రాముడేలిన రామరాజ్యమందంతట
  ధర్మంబు నాల్గు పాదాల నడిచె
  రాముడేలిన రామరాజ్యమందంతట
  ప్రకృతి సుభిక్షమై పరవశించె
  రాముడేలిన రామరాజ్యమందంతట
  ప్రజలలో సుఖ శాంతి పరిఢవిల్లె

  నాడు రాముడే రక్షణ , నేడు రామ
  నామ మారాముకంటె కనంగ శత స
  హస్ర మెక్కుడై నిల్చి , మహా మహిత ప్ర
  భావ శీలమై రక్షించు భరత ప్రజల .

  రిప్లయితొలగించండి
 2. శ్రీరామ పట్టాభి షేక చిత్తర్వుతో
  యిళ్ళలో జేరెద రిచటి జనులు
  తొలుదొల్త శ్రీరామతో మొదుల్ బెట్టక
  యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
  పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
  నిద్రకు జారుట నియతి యిచట
  రామనామమ్ములు రంజిల్ల భజియించి
  మంచాలు దిగుదురు మనుజులిచట

  మరణ శయ్యను గూడ రామా యనుటను
  మాట గోల్పోవు చున్నను మరువ రిచట
  యిచటి జన జీవనాన మమేకమయ్యె
  రామనామమ్ము శ్రీరామ రామ రామ .

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.