ఉ. రాముని మిత్రుడై యొకడు రాజ్యపదంబు నలంకరించెరా రాముని పాదమంటి యొక రాక్షసుడే చిరజీవి యాయెరా రాముని దాసుడై యొకడు బ్రహ్మపదంబును బొంది మించెరా రాముని భక్తు లందరకు రాముని సన్నిధి శాశ్వతంబురా |
15, అక్టోబర్ 2015, గురువారం
రాముని సన్నిధి శాశ్వతంబురా
4 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రిప్లయితొలగించండిముప్పాళ రంగ నాయకమ్మ గారు బ్లాగు లోకం లేరు కాబట్టి మీరు ఇట్లాంటి టపాలు వ్రాయగలుగు తున్నారు :) జేకే !
రాముని భక్తు లందరకు రాముని సన్నిధి శాశ్వతంబురా
నిజంగా నే నంటారా ?
జిలేబి
ఈ జేకే ఏమిటీ అని అడుగుదామని చాలా సార్లు అనుకున్నానండోయ్. ఇప్పుడు గుర్తొచ్చి అడుగుతున్నాను - ఇంతకీ ఈ జేకే అంటే ఏమిటో చెప్పండి దయచేసి.
తొలగించండిమీరు ముప్పాళ్ళ లేదా ముప్పాళ రంగనాయకమ్మ అని అనుకుంటున్నారా? ఆవిడ ఇంటిపేరును పరిత్యజించి బహుకాలం అయ్యింది!
ఆవిడి విషవృక్షాన్ని బజార్లో పెట్టిన రోజుల్లోనే ఎమ్మెస్ రామారావుగారు సుందరకాండ పారాయణంతో ఊరూవాడా హోరెత్తించారు.
ఇంగ్లీషోడి సామెత ఉంది చూడండి You go to your church, we go to ours అని. అలా దేనికదే. మాకైతే పోయేదేం లేదు.
ఇకపోతే రాముని భక్తు లందరకు రాముని సన్నిధి శాశ్వతంబురా అన్నది నేను. మీరు కాదన్నా అదే అంటాను. నాజన్మజన్మాంతరానుభవం అది అని నేనంటే మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కాని ఇలాంటి మాటల్ని కొట్టిపారేసే తిట్టిపోసే మనుషులకూ కొదవలేదు మన దేశంలో. ఐనా నేను అందరికీ నచ్చాలన్న ఆశతో వ్రాయటం లేదని ముక్తాయింపు ఒకటి ఇచ్చేసి గమ్మునుంటాను. ఏమంటారు?
అందరికీ నచ్చేలా యే ఒక్కరూ రాయలేరు,
తొలగించండియే ఒక్కరూ అందరినీ తమవలె చూడలేరు,
ప్రతివారికీ అస్మదాదులూ తస్మదాదులూ ఇద్దరూ ఉంతారు!
అందరికీ నచ్చేలా యే ఒక్కరూ రాయలేరు,
తొలగించండియే ఒక్కరూ అందరినీ తమవలె చూడలేరు,
ప్రతివారికీ అస్మదాదులూ తస్మదాదులూ ఇద్దరూ ఉంటారు!